చిట్వేల్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్వేల్ మండలం దేమాచుపల్లి గ్రామంలో వినాయకుడి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించిన అనంతరం లడ్డూ వేలం పాట చేపట్టారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా వేలం పాడారు.
చివరకు మన్నూరు వెంకటసుబ్బారెడ్డి రూ.35 వేలకు అత్యధిక పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. లడ్డూను దక్కించుకున్న వెంకటసుబ్బారెడ్డిని గ్రామస్థులు, భక్తులు అభినందించారు. వినాయక చవితి వేడుకల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రూ.35 వేలకు వినాయకుడి లడ్డూ వేలం దేమాచుపల్లిలో ఉత్సాహంగా సాగిన వేలంపాట
చిట్వేల్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్వేల్ మండలం దేమాచుపల్లి గ్రామంలో వినాయకుడి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించిన అనంతరం లడ్డూ వేలం పాట చేపట్టారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా వేలం పాడారు. చివరకు మన్నూరు వెంకటసుబ్బారెడ్డి రూ.35 వేలకు అత్యధిక పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. లడ్డూను దక్కించుకున్న వెంకటసుబ్బారెడ్డిని గ్రామస్థులు, భక్తులు అభినందించారు. వినాయక చవితి వేడుకల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

