అమరావతి
నవంబరు ఒకటికి ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా!
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను నవంబరు 1కి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 99 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్, నవంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్టోబరు 25న అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. మైదుకూరులో మళ్లీ నామినేషన్లు స్వీకరించనుండటంతో అక్కడ పోలింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
