వైసీపీ జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలి . మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు
——–
కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని కనిగిరి మాజీ ఎమ్మెల్యే,విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు అన్నారు. మంగళవారం శీలంవారిపల్లి గ్రామంలో జడ్పిటిసి అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కదిరి బాబురావు గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా అన్ని వర్గాల పేదలకు మేలు చేకూర్చారని తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాలను చూసి జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాపరెడ్డి మండల వైసీపీ అధ్యక్షులు పాలగుల్ల మల్లికార్జున్రెడ్డి, కదిరి ప్రకాశరావు, కదిరి పార్ధసారధి,మాజీ ఎంపీపీ బి వెంకటయ్య,వైసీపీ నాయకులు దుగ్గిరెడ్డి జయరెడ్డి,షేక్ బుజ్జి, భూమి రెడ్డి వెంకటరెడ్డి, మన్నేపల్లి పెద్దన్న, సిహెచ్ రాధాకృష్ణారెడ్డి,పులి మాల్యాద్రి రెడ్డి, షేక్ మాబు,మునగల నారాయణరెడ్డి, మూరం కాశిరెడ్డి, గోను చంద్రశేఖర్ రెడ్డి,ఇరగని చలపతిరావు,కొట్టే శ్రీను, జి రంగారెడ్డి,ఇర్ల వీరాంజనేయులు, పి ఆదినారాయణ,బొట్ల చిరంజీవి, మన్నేపల్లి రవి,డి రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
