Thursday, 1 October 2026

Tag: Andhra Pradesh

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్‌లో ₹857 కోట్ల అభివృద్ధి: కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పరిధిలోని 36 డివిజన్లకు రూ.109 కోట్లు మంజూరయ్యాయని, వీటితో 625 అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో నెల్లూరు నగర కార్పొరేషన్‌కు మరో రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆమంచర్లలో పారిశ్రామికవాడకు 500 ఎకరాలు, నరసింహకొండకు కేంద్ర నిధుల సాధనలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సహకారం కీలకమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

అమరావతి

డీఎస్సీపై పోరాటం ఆగదు: వైఎస్ జగన్

డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలపై జరిగిన ఘటనలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, నిరసన కార్యక్రమాల సందర్భంగా తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నందుకే తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల రహిత నెల్లూరే లక్ష్యం: నారాయణ

నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

వైఎస్ఆర్ వర్ధంతి రోజునే పోలవరం జలాలు

వైఎస్ఆర్ వర్ధంతి రోజున పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడం ప్రత్యేక చారిత్రక సందర్భంగా నిలిచింది. పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయన ప్రభుత్వ కాలంలో ఎడమ, కుడి ప్రధాన కాలువల పనులకు కీలక ముందడుగు పడింది. ఏళ్ల తర్వాత ఆయనను స్మరించుకునే రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎడమ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడం సాగునీటి రంగంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ఆర్ కల, కాలువ, వర్ధంతి ఒకే రోజున కలిసిన చారిత్రక సందర్భమిది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అవ్వాతాతల ఆనందమే మా సంతోషం : మంత్రి నారాయణ

అవ్వాతాతల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో మంగళవారం NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం 62 లక్షల కుటుంబాల పింఛన్ల కోసం ఏటా ₹33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు ₹73,594.44 కోట్లు కేటాయించిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు ₹4,000, దివ్యాంగులకు ₹6,000, పూర్తి వికలాంగులకు ₹15,000, కిడ్నీ, కాలేయ వ్యాధిగ్రస్తులకు ₹10,000 అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కృషితో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనూరాధ, విజేతా రెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కొండా ప్రవీణ్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కరువు కాటేస్తుంటే చంద్రబాబు మౌనం: జగన్

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు తగ్గిందని, రైతులకు సాగునీరు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, ఉపాధి హామీ పనులపై వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పీజీఆర్ఎస్ కు 214 అర్జీలు

అమలాపురం, పున్నమి దినపత్రిక: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు అధికారులు ఆదేశించారు. సోమవారం డా.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, కొత్తపేట, రామచంద్రాపురం ఆర్డీవోలు జీవీవీ.సత్యనారాయణ, సరళావతి, ఎస్డీసీ డి.అచ్యుతా కుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, స్వర్ణ గ్రామ, వార్డు అధికారి పి. రాజేశ్వరి, డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్ తదితరులతో కలిసి జిల్లా చుట్టూ ప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, ఇళ్లు, పింఛను, సదరం సర్టిఫికెట్, రహదారులు మంజురు వంటి అంశాలపై మొత్తం 214 అర్జీలు అందాయి.ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని డీఆర్వో ఆదేశించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి‌.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలో నమోదైన అర్జీల పట్ల సంబంధిత అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి, తప్పనిసరిగా నిర్దిష్ట కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో నమోదై అర్జీలకు సరైన పరిష్కార నివేదిక సిద్దం చేసి, ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని డీఆర్వో అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల కొరకు 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీ కోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదుకు అవకాశం ఉందని, అలాగే మండల, గ్రామ వార్డు స్థాయిలలో అధికారులకు సమర్పించవచ్చునన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగ చేసుకోవాలని చేయాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని, బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదని, బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి, కొత్త నాయకత్వం తయారవుతుందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం, రాజకీయ సాధికారతకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించి బీసీ సమాజానికి న్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దళితుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యం

సామాజిక శంఖారావం – చలో కలెక్టరేట్ జయప్రదం పాలకులు నిర్లక్ష్యం మే సమస్యలు పరిస్కారం కాక పోవడానికి కారణం : మాజీ ఎమ్మెల్సీ ఐ వి ​అమలాపురం,పున్నమిపత్రిక : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఎ.పి. వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, వివిధ దళిత, ప్రజా సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో నిర్వహించిన “సామాజిక శంఖారావం చలో కలెక్టరేట్” వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ​జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగు చూసిన దళితుల సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. దళిత గ్రామాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అనేక చోట్ల శ్మశాన వాటికలు ఆక్రమణకు గురికావడం మరియు అక్రమ ఆక్వా సాగు వల్ల తాగునీరు కలుషితం కావడం పట్ల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారం కోసం కుల మతాలకు అతీతంగా అభ్యుదయ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.పాలకులు నిర్లక్ష్యంమే సమస్యలు పరిస్కారం కాక పోవడానికి కారణం అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారుతున్నాయి. దళిత సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యం అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, జీవో 1235 అమలులో ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని ఎండగట్టారు., జిల్లాలో భూస్వాములు చేతుల్లో ఉన్న సుమారు పది లక్షల కొబ్బరి చెట్లను ప్రతి దళిత కుటుంబానికి 15 చెట్లు చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. అక్రమంగా దళిత కాలనీలకు ప్యాట్లు కానుకుని సాగు చేస్తున్న ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ జంగా బాబురావు మాట్లాడుతూ దళిత పేటల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు శ్మశాన స్థలాల పునరుద్ధరణ తక్షణమే జరగాలన్నారు. ప్రముఖ దళిత నాయకులు గడ్డం సురేష్ బాబు మాట్లాడుతూ కుల వివక్షత, అంటరానితనం ఇంకా రూపాలు మార్చుకుని కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు. అడ్వకేట్ వడ్డీ నాగేశ్వరరావుమాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులతో పాటు పలువురు దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు,సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్, ఎన్ బలరాం కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసి రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ,రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఐ. మంగాదేవి, నాయకులు పి.శివ, ప్రముఖ మాలమహానాడు జిల్లా నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు, విసికె పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి,బొంతు రమణ, వ్యక సంఘం జిల్లా నాయకులు పాము బాలయ్య ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దైవ కృప, సిఐటియు ఆశ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుభాషిని, జిల్లా నాయకురాలు సిహెచ్ దుర్గ, ఏపీఆర్పిఏ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, డి.నాగేందర్రాజు, పి కొండలరావు,అబూజీ,జిల్లా నాయకులు ఎన్ అబ్బులు,నాయకులు జి. మురళి, మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి దళిత సంఘాల, ప్రజాసంఘాల నాయకులు ధోనిపాటి విజయలక్ష్మి, షకీలా, మచ్చనగబాబు, ముంగడ ఆశీర్వాదం, సాపే రమేష్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు: దళితుల శ్మశాన సమస్యల పరిష్కారానికి ఇచ్చిన జీవో 1235ను వెంటనే అమలు చేయాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ మరియు కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను అమలు చేసి, భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి 2 ఎకరాల భూమి కేటాయించాలి. వేమవరం పాడు, వన్నె చింతలపూడి,వేమవరం తాండవపల్లి వంటి గ్రామాల్లో ఆక్రమణకు గురైన శ్మశాన స్థలాలను సర్వే చేయాలి దళిత పేటల్లో అక్రమ ఆక్వా సాగును నిరోధించి మంచి నీటి సదుపాయం కల్పించాలి. మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పటిష్టంగా అమలు చేస్తూ, బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. 

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాడపల్లి ఆలయాన్ని దర్శించుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి

వాడపల్లి,పున్నమి దినపత్రిక : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు జడ్జి గారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, ప్రసాదాలను అందించారు. అంతకుముందు ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.