Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు కార్యక్రమంలో సాంబశివరావుపాల్గొన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు కార్యక్రమంలో సాంబశివరావుపాల్గొన్నారు

59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ది. 17.11.2026న మైలవరం శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు అయ్యంకి వెంకట రమణయ్య గారు, డాక్టర్ S. R రంగనాథన్ గారు, పాతూరు. నాగభూషణం గారు, గాడి చర్ల హరిసర్వోత్తమ రావు గారు, మొదలైన వారిని స్మరించుకుంటూ ప్రముఖులచే ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు గ్రంథపాలకులు T. సాంబశివరావు గారు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుల త్యాగాల వలన గ్రంధాలయాలు ఏర్పడ్డాయని ప్రతి ఒక్క విద్యార్థి గ్రంధాలయాన్ని వినియోగించుకోవాలని కోరారు. తదుపరి AI ( కృత్రిమ మేధస్సు) మనిషి మెదడు లాగా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం,AI( కృత్రిమ మేధస్సు) చేయగలదని, వైద్యరంగంలో AI ప్రాముఖ్యత మొదలు అంశాల గురించి వివరించారు. తదుపరి AP గ్రంథాలయ APP గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు కార్యక్రమంలో సాంబశివరావుపాల్గొన్నారు

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు కార్యక్రమంలో సాంబశివరావుపాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *