S :నవంబర్ 16 : మైలవరం
కీర్తిరాయునిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా కోమల నామినేషన్ దాఖలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కీర్తిరాయునిగూడెం గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా రాజా గారి సతీమణి బొర్రా కోమల నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా సోమవారం చంద్రల సచివాలయంలో బొర్రా కోమల గారితో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా కీర్తిరాయునిగూడెం గ్రామ ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై బొర్రా కోమలకు తమ మద్దతు తెలియజేయాలని పార్టీ వర్గాలు కోరాయి.

