Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం లక్కిరెడ్డి బాల రెడ్డి గ్రామంలో వైసీపీ సర్పంచి తిరుమల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం లక్కిరెడ్డి బాల రెడ్డి గ్రామంలో వైసీపీ సర్పంచి తిరుమల ప్రచారం

వెల్వడం అభివృద్ధే లక్ష్యం.. గెలుపే ధ్యేయంగా వైసీపీ అభ్యర్థి తిరుమల ప్రచారం

ప్రజలతో మమేకం.. ఆప్యాయ పలకరింపులతో ఎన్నికల ప్రచారంలో దూకుడు

మైలవరం: వెల్వడం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిరుమల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కొరతపై ప్రజలతో చర్చిస్తూ పాలకుల బాధ్యతను ప్రశ్నిస్తున్నారు. వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపడంలో పాలకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు. గతంలో గ్రామ ప్రజలకు అందించిన సేవలను కొనసాగిస్తూ వెల్వడం అభివృద్ధికి కొత్త దిశ చూపుతానని భరోసా ఇస్తున్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించి సర్పంచిగా గెలిపించాలని తిరుమల ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.

మైలవరం మండలం లక్కిరెడ్డి బాల రెడ్డి గ్రామంలో వైసీపీ సర్పంచి తిరుమల ప్రచారం

మైలవరం మండలం లక్కిరెడ్డి బాల రెడ్డి గ్రామంలో వైసీపీ సర్పంచి తిరుమల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *