Thursday, 1 October 2026

Tag: Andhra Pradesh

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎంపీ హరీష్ మాధుర్

పరిశుభ్ర పట్టణమే లక్ష్యంగా కార్యాచరణ స్వచ్ఛతపై ప్రజలకు అధికారుల పిలుపు అమలాపురం, పున్నమి దినపత్రిక: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం కల్వకొలను వీధి స్వర్ణ వార్డు వద్ద “క్లీన్ సిటీస్-గ్రీన్ కమ్యూనిటీస్” ఇతివృత్తంతో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు అందించాలని సూచించారు. కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులను మరింత సమర్థంగా శుభ్రం చేసేందుకు త్వరలో స్వీపింగ్ మిషన్ మంజూరు చేస్తానని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు త్వరలో వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యర్థాలు పడవేసే వారిని గుర్తించి పర్యావరణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీకి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో కె. సుబ్బారావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు చిక్కాల గణేష్, పెచ్చెట్టి విజయలక్ష్మి, కర్రి దత్తుడు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డు కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం

డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు స్మారకార్థం వైద్య సేవలు వైద్య శిబిరంలో పాల్గొన్న ఎంపీ, టీడీపీ నేతలు అమలాపురం,పున్నమి దినపత్రిక: అమలాపురం టౌన్ బ్యాంకు ఆధ్వర్యంలో కాపు కల్యాణ మండపంలో శనివారం డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు మెమోరియల్ ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కోపరేటివ్ బ్లడ్ డోనర్స్ అండ్ వాలెంటరీ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టౌన్ బ్యాంకు చైర్మన్ మెట్ల వెంకట సూర్యనారాయణ, డైరెక్టర్ మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో అగర్వాల్ కంటి ఆసుపత్రి, రాజమండ్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జి. ప్రభాకర్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, డాక్టర్ గోలకోటి ఫణికుమార్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఎం.ఎ.ఐ. బాషా ఆధ్వర్యంలో విద్యుదయస్కాంత చికిత్సకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మెట్ల సూర్యనారాయణ, గోలకోటి రంగారావు, డాక్టర్ సి.హెచ్. విష్ణుమూర్తి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, తిక్కిరెడ్డి నేతాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పెచ్చెట్టి విజయలక్ష్మి, బ్యాంకు డైరెక్టర్లు ఎ. శ్రీనివాసు, పి.జాన్‌పాల్, చింతా శంకరమూర్తి, సి.హెచ్. విష్ణుమూర్తి, గోలకోటి రంగారావు, బ్యాంకు ఎం.డీ. శిరగం వేణుగోపాలరావు, మేనేజర్ చిక్కం బాబు, రక్తదాతల సంఘం ప్రతినిధి ఎ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వివిధ రాజకీయ పార్టీ నేతలతో అమలాపురం తహశీల్దార్ సమావేశం

అమలాపురం మండల. పట్టణ ఓటర్ల సార్ ప్రక్రియ పై అమలాపురం డి ఎల్ డి ఓ విజయ భాస్కర్ వివిధ రాజకీయ పార్టీ నేతలతో అమలాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ విఎస్ దివాకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రానున్న ఎన్నికలు సజీవుగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలతో డ్రాప్ రోల్.. కొత్త ఓటర్ల జాబితా. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు. ప్రత్యేక ఓటర్ల క్యాంపియన్ డే కార్యక్రమాలపై సమీక్షించారు.. తాసిల్దార్ దివాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వచ్చే నెల 20వ తేదీ వరకు అవకాశం ఉందని.. అలాగే కొత్తగా ఓటర్లు నమోదు చేయించేందుకు ఆగస్టు నెల ఒకరు లోపు చేయించుకోవచ్చని తెలిపారు.. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుండి తిక్కిరెడ్డి నేతాజీ. నేదునూరి నతనీయులు. జనసేన పార్టీ నుండి లింగోలు పండు. పరమట చిట్టిబాబు. వైసిపి పార్టీ నుండి విత్తనాల మూర్తి. బిజెపి పార్టీ నుండి బొంతు శివాజీ. కాంగ్రెస్ పార్టీ నుండి రాయుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

యువ ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్

18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అమలాపురం,పున్నమి దినపత్రిక: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలు నుండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వివేక్ యాదవ్, అడిషనల్ సీఈవో లు ఢిల్లీ రావు,వెంకటేశ్వరరావు లతో కలిసి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు సంబంధించి నోటీసులు జారీ,పంపిణీ, నోటీసు విచారణ,నోటీసు అందజేత, ఫారం-6,6ఎ,7,8 నిర్వహణ క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు, ఎన్ జి ఎస్ పి వంటి అంశాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా పనులు పూర్తయ్యాయని, పెండింగ్లో ఉన్న పనులను త్వరతిగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని తెలియజేశారు.అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కొత్త ఓటర్లకు Form-6 పై అధికారులు అవగాహన కల్పించి,ఓటరు జాబితాలో వివరాలను నమోదు చేసుకునే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. యువ ఓటర్లు “నా ఓటు – నా బాధ్యత” అనే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు కూడా అర్హత కలిగిన యువతను ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి సుబ్బారావు, జిల్లా పరిపాలన అధికారి నాగ లక్ష్మమ్మ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల రక్షణకు ముమ్మర చర్యలు చేపట్టాం: జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

✍️జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యవేక్షణలో సహాయక చర్యలు ✍️భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో సమన్వయంతో విస్తృత గాలింపు అమలాపురం,పున్నమి దినపత్రిక: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక, గాలింపు చర్యలను కొనసాగిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని ఫిషరింగ్ ల్యాండ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, ముమ్మిడివరం స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ లతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కింజరాపు అచ్చేన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గల్లంతయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్ర మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం, పోలీస్, మెరైన్ విభాగాలు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని తెలిపారు. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్ డి -ఏపి – ఈ8-ఎమ్ -ఎమ్ఓ-135 (ముత్యాలమ్మ బోటు)లో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కోపనాతి రామకృష్ణ, కొల్లాటి యేసుదాసు, పాలేపు సంతోషరావు, కర్రి రాంబాబు, కొల్లాటి శ్రీనుబాబు, సంగడి తాతారావు, పోనాడి సతీష్‌లు ఈ బోటులో ఉన్నారు. వీరంతా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందినవారని బాదిత కుటుంబాలు మంత్రికి తెలియజేశారు. సాధారణంగా పది రోజుల్లో తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు తెలిపి సముద్రంలోకి వెళ్లినప్పటికీ, నిర్ణీత గడువు దాటిన తరువాత కూడా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ డా.ఆర్ మహేష్ కుమార్ వెంటనే స్పందించి గాలింపు చర్యలను ప్రారంభించారని బాధితులు తెలియజేశారు. 300 నాటికల్ మైళ్ల పరిధిలో విస్తృత గాలింపు చేస్తున్నారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 నౌకలు, భారత నౌకాదళానికి చెందిన 2 నౌకలు, అలాగే నేవీకి చెందిన 2 అత్యాధునిక విమానాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో సముద్ర ప్రాంతాన్ని జల్లెడ పడుతూ బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరంగా శోధన కొనసాగుతోందని మంత్రి అచ్చేన్నాయుడు భరోసా ఇచ్చారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం తదితర తీర ప్రాంతాల రక్షణ విభాగాలకు సమాచారం అందించి సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు, బోటు ప్రయాణించే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని గాలింపు పరిధిని విస్తరిస్తున్నారని తెలిపారు. మరోవైపు పారాదీప్ సమీపంలో బోటు గుర్తింపు తాజాగా ఒడిశాలోని పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో పసుపు రంగులో ఉన్న ‘ముత్యాలమ్మ’ పేరుతో కూడిన బోటును గుర్తించినట్లు సమాచారం అందింది. దీనిపై అధికారులు అప్రమత్తమై, గుర్తించిన బోటు గల్లంతైన మత్స్యకారుల బోటేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించామని తెలిపారు. బోటులో ఇంధనం, ఆహార నిల్వలు, గల్లంతైన బోటులో సుమారు 1,000 లీటర్ల డీజిల్, దాదాపు 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. ప్రస్తుతం సముద్ర వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో జిల్లా యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని,జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గాలింపు చర్యల్లో లభిస్తున్న తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి ఒడ్డుకు చేర్చే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని మత్స్య శాఖ మంత్రి తెలిపారు. ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ, భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్, తీర ప్రాంత రక్షణ విభాగాలు సమన్వయంతో గాలింపు, రక్షణ చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయని రాష్ట్ర మత్స్యశాఖ వెల్లడించిందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీవో ఎ.సరళావతి, అముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మత్స్యశాఖ జేడీ కరుణాకర్, మత్స్యశాఖ ఏడి రమణారావు, ఎఫ్ డి ఓ.శివరామకృష్ణ, ఎమ్మార్వోలు కూటమి నాయకులు మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

​ఓడలరేవు మత్స్యకారుల ఆచూకీ కోసం హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి: సిపిఎం

బాధిత కుటుంబాలకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయం, ఉచిత నిత్యావసరాలు అందించాలి – సిపిఎం డిమాండ్ ​ఓడలరేవు,పున్నమి దినపత్రిక,ఆగస్టు 19: అల్లవరం మండలం ఓడలరేవు గ్రామం నుండి సముద్రంలో వేటకు వెళ్లి 17 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం అత్యంత విచారకరమని, గాలింపు చర్యలను అత్యంత వేగవంతం చేసి బాధితులను త్వరితగతిన సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ​సిపిఎం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ బృందం ఓడలరేవు గ్రామంలో పర్యటించి, తప్పిపోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించింది. వారిని ఓదార్చి, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పింది. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు,జిల్లా కమిటీ సభ్యులు ఎన్. బలరాం,జిల్లా నాయకులు కారుపల్లి గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. ​అనంతరం ఓడలరేవులో శోధనా చర్యలను పర్యవేక్షిస్తున్న అమలాపురం ఆర్డీవోని కలసి పలు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 17 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నావికాదళం ( నావి), కోస్ట్ గార్డ్, హెలికాప్టర్లతో ముమ్మరంగా శోధించి మత్స్యకారులను సురక్షితంగా రక్షించాలని ప్రభుత్యాన్ని డిమాండ్ చేశారు.ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ. 50,000 ఆర్థిక సాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని RDO ఆర్‌డిఓని కోరడమైనది. ​అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు: సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి బోటుకు శాటిలైట్ నావిగేషన్ ట్రాన్స్‌మిటర్లు అమర్చడంలో మత్స్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యమే నేడు మత్స్యకారుల ప్రాణాలకు ముప్పుగా మారింది. దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తప్పిపోయిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వచ్చేవరకు మరియు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ వారి తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. ​

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓడలరేవు మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడంలో కూటమి ప్రభుత్వం : పినిపే శ్రీకాంత్

ఓడలరేవు, పున్నమి దినపత్రిక: ఓడలరేవు గ్రామంలో గల్లంతైన మత్సకారుల కుటుంబాలను వైయస్సార్సీపి నియోజవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి మత్స్యకార బోటుకు తప్పనిసరిగా ఉండాల్సిన జిపిఎస్ ట్రాకర్లు, ఎస్ఓ ఎస్ పరికరాలను అమర్చేందుకు కూడా మత్స్యకారుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మత్స్యకారుల భద్రతకు సంబంధించిన పరికరాల విషయంలో కూడా అవినీతి, చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. విషాదకర పరిస్థితి నెలకొని, మత్స్యకారుల కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇప్పటివరకు స్పందించకుండా కుటుంబాలను పరామర్శించకపోవడంపై శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. Uploaded Video: Uploaded Video:

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్

పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్. అమలాపురం,పున్నమి దినపత్రిక: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు, లోపాలకు తావులేకుండా ముందస్తు సన్నాహక ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు.బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ముందస్తు సన్నాహక ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితాల ప్రచురణ, ఎన్నికల సంబంధిత ప్రచురణలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ముందస్తు సన్నాహక చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 10,90,975 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లాలోని 19 మండలాల పరిధిలో 342 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3,878 వార్డులను గుర్తించినట్లు తెలిపారు. వీటి పరిధిలో మొత్తం 3,968 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితా పేజీలను నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదిత ఓటర్ల జాబితా పేజీల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితాల విభజన, ప్రచురణ తదితర ప్రక్రియలను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. *ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం* స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల గుర్తింపు, వర్గీకరణ, వర్తింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. డివిజన్, మండల స్థాయిల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా సిద్ధం చేయాలని సూచించారు.రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్నికల కమిషన్ నిబంధనలు, అమలులో ఉన్న చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. *ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ* ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పోలింగ్ విధానం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓటర్ల జాబితాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, విధులు–బాధ్యతలు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు.శిక్షణ అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తమకు అప్పగించిన బాధ్యతలపై ఎటువంటి సందేహాలు లేకుండా చూడాలని, అవసరమైన చోట ప్రాక్టికల్ శిక్షణ కూడా అందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ముందస్తు ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది, శిక్షణ, రిజర్వేషన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వి సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారిని శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలి: జిల్లా కలెక్టర్‌

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష పున్నమి దినపత్రిక ఆగష్టు19,2026:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశం మందిరంలో శ్రీవత్స ఫౌండర్ సీఈవో బమిడిపాటి కిరణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాడపల్లి ఆలయ అభివృద్ధికి సంబంధించి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ను సమగ్రంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను సూచించారు.ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఆలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భవిష్యత్‌లో పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు వివరాలు సమర్పించారు.మాస్టర్ ప్లాన్‌లో ఆలయ ప్రాంగణ అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుధ్యం, క్యూలైన్ వ్యవస్థ, భక్తుల విశ్రాంతి ప్రాంతాలు, వాహనాల నియంత్రణ, పచ్చదనం, పరిసరాల సుందరీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించాలని, రద్దీ సమయాల్లో భక్తుల నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులకు అనుకూలంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం తదితర అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, అవసరమైన మార్పులు, చేర్పులు చేసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు.వాడపల్లి ఆలయ అభివృద్ధి పనులు భక్తుల సౌకర్యాలతో పాటు ప్రాంతీయ పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌ను నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అమలాపురం ఆర్డీవో జి వి వి సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ,జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు, అగ్నిమాపక శాఖ అధికారి పార్థసారథి, ఆత్రేయపురం ఎమ్మార్వో టి. రాజేశ్వరరావు,ఇండస్ట్రీస్ జిఎం అరుణ జిఐఎస్ కోఆర్డినేటర్ లీర్తి, ఇంజినీరింగ్ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 19న కలెక్జటరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి:ఏపిఆర్పిఏ

అమలాపురం ఎంప్లాయీస్ హోమ్‌లో కరపత్రాల ఆవిష్కరణ ​ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఏపిఆర్పిఏ) పిలుపు పున్నమి దినపత్రిక ​అమలాపురం, ఆగష్టు -17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈనెల ఆగస్టు 19వ తేదీ (బుధవారం) నాటి ‘చలో కలెక్టర్ కార్యాలయం’ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ( ఏపిఆర్పిఏ) నాయకులు పిలుపునిచ్చారు.​సోమవారం అమలాపురం ఎంప్లాయీస్ హోమ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఇందుకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు , జిల్లా అధ్యక్షులు కడలి సత్యనారాయణ( కేఎస్ఎన్) ప్రధాన కార్యదర్శి జి.వి. గోపాల కృష్ణ,ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు తీర్చమని పోరాటాలు చేస్తుంటే పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ​కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్లు కోరుతూ: ​కోట్లాదిమంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను తక్షణమే రద్దు చేయాలి. ​కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్‌సీ నివేదికను రప్పించి 01.01.2026 నుండి అమలు చేయాలి, అంతవరకు మధ్యంతర భృతి (IR) (ఐఆర్) చెల్లించాలి. ​ఈపీఎస్ 95 (ఈపిఎస్95) పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9,000/- మరియు డిఏ కలిపి చెల్లించాలి. ​హయ్యర్ పెన్షన్ అమలుపై కోర్టు తీర్పులను వెంటనే అమలు చేయాలి. ​ఎన్‌.పి.స్, సిపిస్,యుపిస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ​పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి. ​రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ: ​12వ పీఆర్‌సీ కమిషనర్ ను నియమించి 30% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి. ​పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల డి.ఎ (డిఏ) లను వెంటనే విడుదల చేయాలి. ​పెండింగ్ బకాయిలు రూ. 25 వేల కోట్లను విడతల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించాలి. ​సీపీఎస్ (సిపిస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిస్) అమలు చేయాలి. ​కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి (రెగ్యులరైజ్ చేయాలి) ​ముఖ్యంగా అంగన్‌వాడీ, ఆశా, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వేతనాల నుండి ఈపీఎఫ్ చందాను వసూలు చేసి పెన్షన్ సదుపాయం కల్పించాలి.​ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ పోరాటానికి తమ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలపాలని కోరడమైనదని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి.శ్రీరామ్మూర్తి, కార్యదర్శులు ఎస్.కృష త్రిమూర్తులు, కండవల్లి శ్రీనివాస్, డి.నాగేంద్ర రాజు, పి.కొండలరావు, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.