Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని, బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదని, బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి, కొత్త నాయకత్వం తయారవుతుందని పేర్కొన్నారు.
బీసీల అభ్యున్నతి, సంక్షేమం, రాజకీయ సాధికారతకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించి బీసీ సమాజానికి న్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *