Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం
{"AIGC":{"ContentPropagator":"001191441900557262083U10400","Label":"1","ReservedCode1":"","ProduceID":"24cc2f9f-9c3a-442d-ad58-6b0182a09f6e","ReservedCode2":"","PropagateID":"24cc2f9f-9c3a-442d-ad58-6b0182a09f6e","ContentProducer":"001191441900557262083U10400"}};

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు స్మారకార్థం వైద్య సేవలు వైద్య శిబిరంలో పాల్గొన్న ఎంపీ, టీడీపీ నేతలు అమలాపురం,పున్నమి దినపత్రిక: అమలాపురం టౌన్ బ్యాంకు ఆధ్వర్యంలో కాపు కల్యాణ మండపంలో శనివారం డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు మెమోరియల్ ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
  • కోపరేటివ్ బ్లడ్ డోనర్స్ అండ్ వాలెంటరీ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టౌన్ బ్యాంకు చైర్మన్ మెట్ల వెంకట సూర్యనారాయణ, డైరెక్టర్ మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.
  • శిబిరంలో అగర్వాల్ కంటి ఆసుపత్రి, రాజమండ్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు స్మారకార్థం వైద్య సేవలు

వైద్య శిబిరంలో పాల్గొన్న ఎంపీ, టీడీపీ నేతలు

అమలాపురం,పున్నమి దినపత్రిక: అమలాపురం టౌన్ బ్యాంకు ఆధ్వర్యంలో కాపు కల్యాణ మండపంలో శనివారం డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు మెమోరియల్ ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కోపరేటివ్ బ్లడ్ డోనర్స్ అండ్ వాలెంటరీ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టౌన్ బ్యాంకు చైర్మన్ మెట్ల వెంకట సూర్యనారాయణ, డైరెక్టర్ మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో అగర్వాల్ కంటి ఆసుపత్రి, రాజమండ్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జి. ప్రభాకర్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, డాక్టర్ గోలకోటి ఫణికుమార్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఎం.ఎ.ఐ. బాషా ఆధ్వర్యంలో విద్యుదయస్కాంత చికిత్సకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మెట్ల సూర్యనారాయణ, గోలకోటి రంగారావు, డాక్టర్ సి.హెచ్. విష్ణుమూర్తి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, తిక్కిరెడ్డి నేతాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పెచ్చెట్టి విజయలక్ష్మి, బ్యాంకు డైరెక్టర్లు ఎ. శ్రీనివాసు, పి.జాన్‌పాల్, చింతా శంకరమూర్తి, సి.హెచ్. విష్ణుమూర్తి, గోలకోటి రంగారావు, బ్యాంకు ఎం.డీ. శిరగం వేణుగోపాలరావు, మేనేజర్ చిక్కం బాబు, రక్తదాతల సంఘం ప్రతినిధి ఎ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *