Thursday, 1 October 2026

Tag: Andhra Pradesh

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దేశభక్తి, సమైక్యతా స్ఫూర్తితో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి తెలుగు దినపత్రిక: అమలాపురం, ఆగస్టు 15, 2026: దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవితో కలిసి స్వాతంత్ర్య సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పోలీసు కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మిషన్ స్పందన్, బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనేది కేవలం హక్కులను పొందడం మాత్రమే కాదని, దేశం పట్ల బాధ్యతలను నిర్వర్తించడం కూడా అని అన్నారు.దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, వైద్యం, మౌలిక వసతులు తదితర రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వికసిత్ భారత్ @2047లో యువత కీలకం వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికత, స్టార్టప్‌లు, సామాజిక సేవ వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువశక్తి ప్రధానమైనదని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. “దేశ అభివృద్ధి – మన బాధ్యత” అనే భావనతో ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి, ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని మరింతగా పెంపొందించుకుని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పరిపాలన అధికారి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పున్నమి దినపత్రిక రిపోర్టర్‌ : శివకృష్ట.పి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*వెన్నెల గద్దర్‌ను సత్కరించిన కోరుకొండ జాన్

పున్నమి దినపత్రిక పి. గన్నవరం, ఆగస్టు 15: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం ప్రాంతానికి చెందిన మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, ఆయన కుమారుడు కోరుకొండ నవీన్ కలిసి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ రథసారథి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్‌ను ఆగస్టు 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా డా. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మమత స్వచ్ఛంద సేవా సమితి ద్వారా గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సంతోషం వ్యక్తం చేసి, అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.తన తండ్రి గద్దర్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఒక ప్రణాళికను రూపొందించి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, డా. వెన్నెల గద్దర్‌కు చేతి గడియారాన్ని బహూకరించి సత్కరించారు. # శివకృష్ణ.పినిపే- పున్నమి దినపత్రిక

కర్నూలు

బైలుప్పల ఎంపీపీ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

స్కూల్ ఆవరణం లో పండగ వాతావరణం పిల్లలకు ఉపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మనహనుభావుల గురించి పిల్లలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో HM కలాం భాషా గారు, మాజీ సర్పంచు మరియు ఎంపీటీసీ గారు అలాగే పంచాయతీ సెక్రెటరీ బాలరాజు గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రహీం భాష గారు వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహుడు గారు డిజిటల్ అసిస్టెంట్ జై వీరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది Uploaded Video:

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎస్పీ కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ పతాకం

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య ఘనంగా వేడుకలు జెండా వందనం చేసిన ఎస్పీ పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ పున్నమి దినపత్రిక, ఆగస్టు 15: డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనంఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా పోలీసు అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, ఎస్బీ సీఐ పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ రాజేష్, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, ఆర్‌ఐ బ్రహ్మానందం, ఆర్‌ఎస్‌ఐ ఏసుబాబు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. *# శివకృష్ణ.పినిపే -పున్నమి దినపత్రిక*

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగ రోజు అన్న, తమ్ములకు ఆడబిడ్డల ఆశీర్వాదం హైదరాబాద్, ఆగస్టు 09, పున్నమి ప్రతినిధి; రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. రాఖీపౌర్ణమి నాడు నిత్యపూజలు చేసి ఇంటిలో ఒక చోట ముగ్గు, పీట వేసి సోదరుడుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను. మిఠాయిలు తినిపించవలెను. సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము, బట్టలు, నగలు గానీ కానుకగా ఇవ్వడం ఆచారం. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || -పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు విజయ ప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాఖీ కట్టవలెను. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.