Tuesday, 2 June 2026

Tag: వైద్యం

News ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

విమ్స్ నూతన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మన్మధరావు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిద్ధితా విశాఖపట్నం : విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ వి. మన్మధరావు సోమవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన మన్మధరావుకు విమ్స్ ఆస్పత్రి వైద్యులు, అభిమానులు, సన్నిహితులు, ఆసుపత్రి పరిపాలన విభాగం, వివిధ విభాగాల సిబ్బంది పుష్ప గుచ్చలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ మన్మధరావు మాట్లాడుతూ  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యం అన్నారు. సమిష్టి కృషితో విమ్స్ సర్వోతోముఖవృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. విమ్స్ కు అన్ని హంగులు కల్పిస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచి పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. విమ్స్ లోని ప్రస్తుతం తొమ్మిది విభాగాలు సూపర్ స్పెషాలిటీగా, 10 విభాగాలు జనరల్ గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన డైరెక్టర్ రాంబాబు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపారని వాటిని అదే స్పీడ్ తో ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత వున్న అంశం తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్ళి ప్రభుత్వానికి నివేదించి త్వరగా భర్తీ చేయడానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. హార్ట్ సర్జీరికి సంబంధించి పీపీపీ పద్ధతిలో క్యాథా ల్యాబ్  ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇదే వరకు పంపారని దాన్ని ముందుకు తీసుకువెళతానని చెప్పారు. అవయవ దానం పై ప్రజలకు పలు అపోహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసి అవయవదాన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి డైరెక్టర్ పదవికి ఎంపిక చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆంధ్రమెడికల్ కాలేజీ లోనే తాను ఎంబిబిఎస్ఎస్ విద్య, ఎం ఎస్, పూర్తి చేసినట్టు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొపెసర్, ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్, సర్జరీ డిపార్ట్మెంట్ విభాగధిపతిగా కేజీహెచ్ లో వివిధ హోదాల్లో 29 సంవత్సరాలు పనిచేసినట్టు వివరించారు. మీడియా సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, అడ్మిన్ డాక్టర్ మనోజ్, డాక్టర్ శిరీష పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.