Friday, 25 September 2026

Tag: వినాయకుని లడ్డూ వేలం పాట

రాజన్న సిరిసిల్ల

గణనాథుని లడ్డూ రూ.28,116కు కైవసం

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని NPR రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతిష్ఠించిన గణనాథునికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో సల్కం చిన్న ఎల్లం యాదవ్ (డిష్) రూ.28,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో సల్కం చిన్న ఎల్లం యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్ రైడర్స్ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.