Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

ఎస్ జి ఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ క్రీడల్లో రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు అండర్ 17 వాలీబాల్ లో సిహెచ్ మహేశ్వర్ లేగల వేదశ్రీ కోకో అండర్ 17 విభాగంలో సిహెచ్ శ్రావణి కబడ్డీ అండర్ 14 విభాగంలో జె నిహారిక జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి మురళీధర్ గారు ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ కొండ రమేష్ గౌడ్ ఏ ఏ పీసీ చైర్మన్ జనగామ రమ అభినందించారు

రాజన్న సిరిసిల్ల

పథకం పనులపై గ్రామసభ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో వి బి జి రామ్ జి పథకంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డి ఆర్ డి ఏ జిల్లా అధికారి లక్ష్మీనారాయణ ఏపీ డి నరసింహులు ఎంపీడీవో సత్తయ్య హాజరయ్యారు ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి ఈ సి టి ఏ గ్రామస్తులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

అరెస్టులపై ఆశ వర్కర్ల ఆగ్రహం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాదులో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆశా వర్కర్లు లావణ్య బాలమణి అనితలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు సమస్యలు పరిష్కరించకుండా అరెస్టు చేయడం సరికాదని లావణ్య అన్నారు ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

రాజన్న సిరిసిల్ల

అమ్మవారికి భక్తుల బోనాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది

రాజన్న సిరిసిల్ల

భద్రత ఏర్పాట్లకు ఆన్ లైన్ సమాచారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన వివరాలను పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఎస్పి మహేష్ బి. గీతే సూచించారు ఆన్ లైన్ నమోదుకు ఎలాంటి రుసుము లేదన్నారు మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు విగ్రహాల ఏర్పాటుకు ముందు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

నిర్ణీత గడువులో విచారణ పూర్తి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు ఎస్ఐఆర్ లో నో మ్యాపింగ్ కేటగిరిలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చి పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 83.846 నోటీసులకు గాను 59.588 మందికి అందజేశామని కలెక్టర్ తెలిపారు నిర్ణీత గడవులో విచారణ పూర్తి చేస్తామన్నారు

రాజన్న సిరిసిల్ల

BRS ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై హరీష్ రావు ఫైర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్యేలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించి మీడియా పాయింట్ నుంచి గెంటేశారని హరీష్ రావు ఆరోపించారు మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు పోలీసులకు ఎవరిని భయపెట్టవద్దని సూచించారు పోలీసుల చర్యలను నిరసిస్తూ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు తమపై చర్యలు సీఎం ఆదేశాలతోనే జరిగాయని సబితా ఆరోపించారు

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ పాదయాత్ర పై మంత్రి ఉత్తమ కౌంటర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 లక్షల మందితో పాదయాత్ర చేస్తానన్న కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు బాధపడతారని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం మంచిదని వాక్యానించారు కళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కి గత ప్రభుత్వా నిర్ణయాలే కారణమని ఆరోపించారు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు

రాజన్న సిరిసిల్ల

ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కెసిఆర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 BRSLP సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో లక్ష మందితో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు కళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

రాజన్న సిరిసిల్ల

ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్ వినతి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా BRS నాయకులు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని BRS నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మండలాల వారీగా ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు ప్రభుత్వం ఏర్పడి అల్లం గడుస్తున్న హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.