గణేష్ ఉత్సవాల వేల డీజేలకు నో ఎంట్రీ డిజె నిర్వహకుల బైండోవర్
గణేష్ ఉత్సవాల వేళ డీజేలకు నో ఎంట్రీ.. డీజే నిర్వాహకుల బైండోవర్ రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 పున్నమి ప్రతినిధి కోనరావుపేట: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కోనరావుపేట పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్సై బండారి రామ్మోహన్ ఆధ్వర్యంలో మండలంలోని డీజే యజమానులు, ఆపరేటర్లను బైండోవర్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్సవాల్లో డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్సై రామ్మోహన్ కోరారు.


