Monday, 31 August 2026

Tag: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి

దుద్యాల మండల, ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మహేష్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

పున్నమి: ఆగస్టు 30 వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, ఉప సర్పంచుల సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ లావుడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్. గోపాల్, జిల్లా అధ్యక్షురాలు నందిని నరేందర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. దుద్యాల మండలం ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా హకీంపేట్‌కు చెందిన మహేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఖాజా మైనుద్దీన్ (గౌరారం), ఉపాధ్యక్షులుగా సంజీవ్ (దుద్యాల), అనురాధ (పోలేపల్లి), ప్రధాన కార్యదర్శిగా మహేష్ ముదిరాజ్ (లగచర్ల), కార్యదర్శులుగా రమేష్ చౌహాన్, దశరథ్, కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, సలహాదారులుగా హనుమాన్ నాయక్, తులసీరామ్, రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శామప్ప, జిల్లా గౌరవ అధ్యక్షులు రామేశ్వర్, జిల్లా ఇన్‌చార్జ్ ప్రవీణ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, అంజి యాదవ్, తాండూర్ మండల అధ్యక్షురాలు కవిత జగదీష్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఉప సర్పంచుల ఐక్యత, హక్కులు మరియు సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. నూతన అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మండలంలోని ఉప సర్పంచుల పక్షాన వారి హక్కులు, డిమాండ్ల సాధన కోసం అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడుతానని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.