పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్పేట్ జీహెచ్ఎంసీ పరిధి, పసుమాముల గ్రామం, కళానగర్ కాలనీకి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త రేవల్లే మదన్ (మస్తాన్) గారికి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది.
నిస్వార్థంగా సమాజ సేవ చేసే వారికి ఎప్పటికైనా, ఎక్కడైనా తగిన గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో, సంస్థ డైరెక్టర్ మరియు తమిళనాడు న్యాయవ్యవస్థ మాజీ న్యాయమూర్తి గౌరవనీయ డా. కె. వెంకటేశన్ చేతుల మీదుగా తమిళనాడు–పుదుచ్చేరి ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవల్లే మదన్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పి.ఆర్. శంపత్, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్), తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇండియా కంట్రీ డైరెక్టర్ సుకుమార్, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రేవల్లే మదన్ ట్రీస్ సొసైటీ చైర్మన్‌గా గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వొకేషనల్ ట్రైనింగ్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, విద్య, వైద్యం, బాలల హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో చురుగ్గా సేవలందిస్తున్నారు.
సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ సంస్థ రేవల్లే మదన్ గారికి ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా రేవల్లే మదన్ ని పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు. భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని రేవల్లే మదన్ తెలిపారు.



