Sunday, 13 September 2026

Tag: ఉత్త మ ఉపాధ్యాయులకు సత్కారం

రాజన్న సిరిసిల్ల

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. మరింత బాధ్యత పెంచిన సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. మరింత బాధ్యత పెంచిన సత్కారం ముస్తాబాద్: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఘనంగా అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, మెరుగైన విద్యను అందించి రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీందర్, ఎంపీడీవో లచ్చాలు, తహసీల్దార్ ఫరూక్, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.