భారతీయ సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రపంచ మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశీయ, అంతర్జాతీయ సినీ రంగ నిపుణులతో కలిసి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు అందించనుంది. చిత్ర నిర్మాణం, పంపిణీ, డిజిటల్ సాంకేతికత వినియోగం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, చిత్రీకరణ అనుమతుల సరళీకరణ వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించనుంది. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరించేలా విధానాలను రూపొందించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

సినీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు