శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. భారత ప్రజలకు ఆయన అందించిన అమూల్యమైన వరం రాజ్యాంగమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఒక్క వర్గానికే పరిమితం కాలేదని, సమస్త సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. సమాజంలో ఉన్న అనేక అవరోధాలను అధిగమించి ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగిన అంబేద్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి అభివృద్ధి వైపు పయనించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ కంటా రమేష్, కూటమి నాయకులు కాసరం రమేష్, పేట బాలాజీ రెడ్డి, గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్ర, సన్నీ, భాస్కరయ్య, రమేష్, మనీ, రామ్మూర్తి, రాంబాబు, పులి శ్రీకాంత్, చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగమే అంబేద్కర్ అందించిన మహావజ్రం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి