Saturday, 5 September 2026

Tag: రోడ్డు ప్రమాదం

ఖమ్మం

రావినూతలలో అదుపుతప్పిన సిమెంట్ లారీ.. ఇద్దరికి గాయాలు

బోనకల్లు / ఖమ్మం బోనకల్లు మండలంలోని రావినూతల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో మధిరకు చెందిన కానిస్టేబుల్ సురేష్ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.