Thursday, 24 September 2026
  • Home  
  • పకడ్బందీగా వార్డు రిజర్వేషన్ల ఇంటింటి సర్వే: మున్సిపల్ కమిషనర్ శేషన్న
- నంద్యాల

పకడ్బందీగా వార్డు రిజర్వేషన్ల ఇంటింటి సర్వే: మున్సిపల్ కమిషనర్ శేషన్న

నంద్యాల వార్డు రిజర్వేషన్ల ప్రక్రియకు అవసరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఇంటింటి సర్వేను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన కుటుంబాల వివరాలను క్షుణ్ణంగా సేకరించి, వాస్తవ సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని స్పష్టం చేశారు.సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. సేకరించిన వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. వార్డు రిజర్వేషన్ల ప్రక్రియకు ఈ సర్వే అత్యంత కీలకమైనందున సర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కమిషనర్ బి. శేషన్న సూచించారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.కమిషనర్ బి. శేషన్న వెంట మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.