Friday, 2 October 2026
  • Home  
  • SIRపై సీపీఎం నిరసన.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
- అనకాపల్లి

SIRపై సీపీఎం నిరసన.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

పున్నమి ప్రతినిధి ఆనంద్ హరిపాలెం: మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని హరిపాలెం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము, సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు, కే. రామ సదాశివరావు మాట్లాడుతూ.. గాంధీజీ స్ఫూర్తితో సాధించిన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. SIR పేరుతో పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వలస కార్మికుల ఓటు హక్కుకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆరోపించారు. SIR ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితాపై పూర్తి పారదర్శకత పాటించాలని, ఓటు హక్కు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో సన్యాసిరావు, ఎస్. కన్నం నాయుడు, భవిరిశెట్టి శివతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్

హరిపాలెం: మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని హరిపాలెం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము, సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు, కే. రామ సదాశివరావు మాట్లాడుతూ.. గాంధీజీ స్ఫూర్తితో సాధించిన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. SIR పేరుతో పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వలస కార్మికుల ఓటు హక్కుకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆరోపించారు.
SIR ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితాపై పూర్తి పారదర్శకత పాటించాలని, ఓటు హక్కు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో సన్యాసిరావు, ఎస్. కన్నం నాయుడు, భవిరిశెట్టి శివతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.