Friday, 2 October 2026
  • Home  
  • తూములు నిర్మించకుండా రోడ్డు వేయొద్దు!
- ఆంధ్రప్రదేశ్

తూములు నిర్మించకుండా రోడ్డు వేయొద్దు!

తూములు నిర్మించకుండా రోడ్డు వేయొద్దు! వినోద్ కుమార్ పున్నమి రిపోర్టర్ ——————————————-★ గూడూరు-తూపిలిపాళెం రహదారి మార్గంలో కోట మండలం కోటమ్మ తల్లీ ఆలయ సమీపంలో రోడ్డు పనులు చేపట్టే ముందు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న రెండు తూములను పునర్నిర్మించి, పూడిపోయిన సాగునీటి పంట కాలువను పునరుద్ధరించాలని తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్న కారు రైతులు డిమాండ్ చేశారు. తూములు లేకుండా రోడ్డు నిర్మిస్తే వందలాది ఎకరాలకు సాగునీటి సమస్య మరింత తీవ్రమవుతుందని, వర్షాకాలంలో పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలోని మలుపుల వద్ద గతంలో రెండు తూములు ఉండేవని రైతులు తెలిపారు. గ్రామం మీదుగా వంజివాక దొరువు వరకు వెళ్లే సాగునీటి కాలువకు అనుసంధానంగా ఉన్న ఈ తూముల ద్వారా దశాబ్దాలుగా వందలాది ఎకరాలకు నీరందేదని చెప్పారు. కాలక్రమేణా పంట కాలువ పూడికకు గురై నామరూపాలు లేకుండా పోవడంతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని పేర్కొన్నారు. కాలువ పునరుద్ధరణ లేకపోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్వర్ణముఖి నది జలాలతో పచ్చగా కళకళలాడిన భూములు ప్రస్తుతం బోరు నీటిపై ఆధారపడుతున్నాయని తెలిపారు. రెండు పంటలు పండే భూముల్లో నీటి కొరత కారణంగా సాగు ఖర్చులు పెరిగి అప్పుల భారం ఎక్కువవుతోందని వాపోయారు. కాలువ పునరుద్ధరణ కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, పనుల కోసం నిధులు మంజూరైనప్పటికీ కొందరు భూస్వాములు అడ్డుకుంటుండంతో కాలువ తవ్వకం పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపించారు. కాలువకు అడ్డంకులు ఏర్పడటంతో వర్షాకాలంలో వరద నీరు వంజివాక దొరువులోకి వెళ్లకుండా వెనక్కి చేరి సుమారు 100 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. కోట తహశీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సంబంధిత మంత్రివరకు తమ సమస్యను తెలియజేసినా పరిష్కారం లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ముందుగా పాత తూములను పునర్నిర్మించాలని, కాలువలో పూడిక తొలగించి సాగునీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. తూములు, కాలువ వ్యవస్థను పునరుద్ధరించకుండా రోడ్డు పనులు చేపట్టవద్దని స్పష్టం చేశారు. తమ సాగు భూములకు నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు.

తూములు నిర్మించకుండా రోడ్డు వేయొద్దు!

  • పాత తూములను పునర్నిర్మించి.. పంట కాలువను పునరుద్ధరించిన తర్వాతే రోడ్డు పనులు చేపట్టాలి
  • తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్న కారు రైతుల ప్రధాన డిమాండ్

వినోద్ కుమార్ పున్నమి రిపోర్టర్
——————————————-★

గూడూరు-తూపిలిపాళెం రహదారి మార్గంలో కోట మండలం కోటమ్మ తల్లీ ఆలయ సమీపంలో రోడ్డు పనులు చేపట్టే ముందు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న రెండు తూములను పునర్నిర్మించి, పూడిపోయిన సాగునీటి పంట కాలువను పునరుద్ధరించాలని తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్న కారు రైతులు డిమాండ్ చేశారు. తూములు లేకుండా రోడ్డు నిర్మిస్తే వందలాది ఎకరాలకు సాగునీటి సమస్య మరింత తీవ్రమవుతుందని, వర్షాకాలంలో పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలోని మలుపుల వద్ద గతంలో రెండు తూములు ఉండేవని రైతులు తెలిపారు. గ్రామం మీదుగా వంజివాక దొరువు వరకు వెళ్లే సాగునీటి కాలువకు అనుసంధానంగా ఉన్న ఈ తూముల ద్వారా దశాబ్దాలుగా వందలాది ఎకరాలకు నీరందేదని చెప్పారు. కాలక్రమేణా పంట కాలువ పూడికకు గురై నామరూపాలు లేకుండా పోవడంతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని పేర్కొన్నారు.

కాలువ పునరుద్ధరణ లేకపోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్వర్ణముఖి నది జలాలతో పచ్చగా కళకళలాడిన భూములు ప్రస్తుతం బోరు నీటిపై ఆధారపడుతున్నాయని తెలిపారు. రెండు పంటలు పండే భూముల్లో నీటి కొరత కారణంగా సాగు ఖర్చులు పెరిగి అప్పుల భారం ఎక్కువవుతోందని వాపోయారు. కాలువ పునరుద్ధరణ కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, పనుల కోసం నిధులు మంజూరైనప్పటికీ కొందరు భూస్వాములు అడ్డుకుంటుండంతో కాలువ తవ్వకం పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపించారు. కాలువకు అడ్డంకులు ఏర్పడటంతో వర్షాకాలంలో వరద నీరు వంజివాక దొరువులోకి వెళ్లకుండా వెనక్కి చేరి సుమారు 100 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.

కోట తహశీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సంబంధిత మంత్రివరకు తమ సమస్యను తెలియజేసినా పరిష్కారం లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ముందుగా పాత తూములను పునర్నిర్మించాలని, కాలువలో పూడిక తొలగించి సాగునీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. తూములు, కాలువ వ్యవస్థను పునరుద్ధరించకుండా రోడ్డు పనులు చేపట్టవద్దని స్పష్టం చేశారు. తమ సాగు భూములకు నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.