Wednesday, 9 September 2026
  • Home  
  • SIR సెకండ్ ఫేజ్ గడువు మరో పది రోజులు పెంచాలి ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు అదనపు అవకాశం కల్పించాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

SIR సెకండ్ ఫేజ్ గడువు మరో పది రోజులు పెంచాలి ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు అదనపు అవకాశం కల్పించాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

వెలగపూడి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): SIR (Special Intensive Revision) సెకండ్ ఫేజ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు మరో పది రోజుల గడువు పెంచాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ నెల 31తో సెకండ్ ఫేజ్ గడువు ముగియనున్న నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. ఓటర్లకు ఫార్మ్-6, ఫార్మ్-7 దరఖాస్తులు సమర్పించేందుకు తగినంత సమయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గడువును మరో పది రోజులు పొడిగించాలని కోరారు. అలాగే ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ మరో ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి ఓట్లపై కూడా సమగ్రంగా పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్‌కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. ఆరు నెలలుగా నివాసం లేని ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించి, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఓటును ఎన్నికల అధికారులు తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ వాస్తవ నివాస పరిస్థితులను పరిశీలించి అనర్హమైన లేదా డూప్లికేట్ ఓట్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

వెలగపూడి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): SIR (Special Intensive Revision) సెకండ్ ఫేజ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు మరో పది రోజుల గడువు పెంచాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ నెల 31తో సెకండ్ ఫేజ్ గడువు ముగియనున్న నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. ఓటర్లకు ఫార్మ్-6, ఫార్మ్-7 దరఖాస్తులు సమర్పించేందుకు తగినంత సమయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గడువును మరో పది రోజులు పొడిగించాలని కోరారు.

అలాగే ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ మరో ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి ఓట్లపై కూడా సమగ్రంగా పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్‌కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. ఆరు నెలలుగా నివాసం లేని ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించి, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కర్ణాటకలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఓటును ఎన్నికల అధికారులు తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ వాస్తవ నివాస పరిస్థితులను పరిశీలించి అనర్హమైన లేదా డూప్లికేట్ ఓట్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.