అరకులోయ మండలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి. జోషి ఆదివారం పర్యటించారు. ఈ మేరకు మండలంలోని మాడగడ పంచాయితీ లోని పీఎస్.244 లో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, డిజిటైజేషన్, ఓటరు నమోదు ప్రక్రియ, BLOల పనితీరు తదితర అంశాలను నిశితంగా పరిశీలించి, SIR కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన పలు సూచనలు చేశారు. అలాగే, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి అవసరమైన మార్గదర్శకాలను అందించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్, ఏఈఆర్ఓ రాజ శ్రీధర్, ఎంపీడీవో, అదనపు ఏఈఆర్ఓ వీసం ప్రసాద్, ఎంఆర్ఐ పట్టాసి శంకరరావు, సూపర్వైజర్ రవికుమార్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ భోగిరాజు, బిఎల్ఓ బి.బి. ప్రసాద్ రావు, సహాయ బిఎల్ఓ విజయశాంతి, స్వర్ణ గ్రామ సిబ్బంది, అంగన్వాడి వర్కర్, రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలింగ్ స్టేషన్ నంబర్లు 245, 254 మరియు 255లకు చెందిన BLOలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు SIR కార్యక్రమాన్ని నాణ్యతతో, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.


