తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 22 మే (పున్నమి ప్రతినిధి) :
ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి SIR ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) యొక్క షెడ్యూల్ ప్రకటించడం జరిగింది.
జూన్ 15 నుండి హౌస్ టు హౌస్ సర్వేని ఎన్నికల సంఘం మొదలు పెట్టబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,18,350 మంది ఓటర్లు ఉన్నారు.
2002 ఓటర్ల జాబితా ప్రకారం 2,68, 86,239 మంది కి ఫ్రీ మ్యాపింగ్ చేసింది ఎన్నికల సంఘం. ఇంకా 1,47,32,111 మంది ఓటర్లకు మ్యాప్ చేయవలసి ఉంది.
రెండు ఎమ్యూనరేషన్ ఫారాలు BLO లు ప్రతి ఇంటికి అందజేస్తారు. 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న వారందరూ అదనంగా కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. కలర్ ఫోటో, ఫోన్ నెంబరు, ఆధార నంబరు ఇవ్వవలసి ఉంటుంది. 2002 ఓటర్ లిస్టులో లేనివారు కొత్తగా 12 ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాటిని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి.
ప్రతి ఒక్కరూ ఈ నమోదు ప్రక్రియలో పాల్గొని నమోదు చేసుకోవాలి. ఆల్రెడీ మేము మేము నమోదు చేసుకున్నాం అని అలసత్వం పాటించవద్దు. మొత్తం ఓటర్లు అందరూ ఇవి సమర్పించాలి.
ఎక్కడైనా BLO లు రెండు ఫారాలు అందజేయకపోతే CEO ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుండి పారాలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది
జూలై 14 వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది.
మీకు ఇచ్చిన రెండు ఫారాలలో ఒకటి BLO తీసుకొని మరొక దానిపై వారు సంతకం చేసి మీకు ఎకనాలెడ్జ్మెంట్ ఇస్తారు.
జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుంది.
జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు వాటిపై ఉన్న అభ్యంతరాలను స్వీకరిస్తారు.
సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు.
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్ కి BLA 2 ని నియమిస్తాం. వారు అతి జాగ్రత్తగా లిస్టును పరిశీలించి అభ్యంతరాలు ఉంటే వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి.
ECI ఆంధ్ర నెట్ లో ఏ బూత్ కి ఎవరు BLO లో వివరాలు ఉంటాయి.
బయట ప్రాంతాల్లో గానీ, బయట దేశాల్లో గాని ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లు ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చా అనే సందేహం అందరిలోనూ ఉంది. తప్పనిసరిగా వారు నమోదు చేసుకోవచ్చును. అందుకు వారు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. వారి తల్లిదండ్రులు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఇక్కడ ఉండి ఎమ్యూనరేషన్ ఫారం పూర్తి చేసి ఇవ్వవలెను. BLO సమాచారం కోసం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు సమాచారం అందించవచ్చును.
వలసదారులైతే రెండు చోట్ల ఓటు ఉండకూడదు. భారతదేశంలో ఒక్కచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి.
భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాలకు BLA 1 లను నియమించడం జరిగింది
46,397 బూత్ లు ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటే ఇప్పటి వరకు 5,000 మంది BLA 2 లను నియమించడం జరిగింది త్వరలో మిగతా వారిని కూడా ఎంపిక చేసి SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది
కూటమి భాగస్వామి పక్షాలైన టిడిపి జనసేన లను కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలకు చెందిన BLA 2 లు వారి వారి పాత్రను పోషిస్తారు.
ఇప్పటివరకు బిజెపి 80175 వర్క్ షాపులు కండక్ట్ చేశాము.
194/944 మండల మీటింగు లు కండక్ట్ చేసాము
119 బూత్ మీటింగులు కండక్ట్ చేసాము
ఫ్రీ మ్యాపింగ్ లో ఉన్న ఓటర్ లు కూడా మరల మ్యాపింగ్ లో పాల్గొనాలి. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లు కూడా అడిగిన పత్రాలు సమర్పించాలి.
ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఓట్లను నమోదు చేసుకోవాలి.


