Thursday, 2 July 2026
  • Home  
  • రూ.3,600 కోట్ల స్టీల్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి ఉపాధి: సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.3,600 కోట్ల స్టీల్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి ఉపాధి: సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూలై 2: మనుబోలు మండలం మడమనూరు సమీపంలో రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్యామ్ స్టీల్ మెటాలిక్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులు, రైతులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండేపల్లి కాలువ పనులను పరిశీలించి, మడమనూరులో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూలై 2: మనుబోలు మండలం మడమనూరు సమీపంలో రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్యామ్ స్టీల్ మెటాలిక్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులు, రైతులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండేపల్లి కాలువ పనులను పరిశీలించి, మడమనూరులో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.