పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) :
గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత, పాస్టర్ కరణం రమణరావు జన్మదినం సందర్భంగా గోకివాడ గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, కొత్తూరు–గోకివాడ మధ్యలో గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంలో చర్చి, గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విద్యా, ఆధ్యాత్మిక సేవలకు విశేష కృషి చేస్తున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు.
అక్కడ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఆ ప్రాంతానికి వెలుగును తీసుకొచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు హాస్పిటల్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సమాజ సేవకు అంకితమైన పాస్టర్ కరణం రమణరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ద్వారపురెడ్డి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.


