Thursday, 9 July 2026
  • Home  
  • జులై 7న గ్రామ గ్రామాన MRPS జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- News

జులై 7న గ్రామ గ్రామాన MRPS జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జులై 7న గ్రామ గ్రామాన MRPS జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల నాయకుల పిలుపు ఇబ్రహీంపట్నం/యాచారం, జులై 6: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ (MRPS) జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని MRPS మండల అధ్యక్షుడు మూలి మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని, ఈ ఉద్యమంలో ఎంతో మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమకారులు పోలీసుల లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదని, జాతి భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం పోరాడిన ఘనత ఎమ్మార్పీఎస్‌కే దక్కుతుందని అన్నారు. ఉద్యమ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, గత 32 సంవత్సరాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు కొనసాగించడం గర్వకారణమని తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిందని, సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకం అమలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు వంటి అనేక ప్రజా సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించిందని, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజల హక్కులను సాధించడంలో ముందుండిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమ చరిత్ర జాతికి గర్వకారణమని ఆయన అన్నారు. జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి, ఉద్యమ స్ఫూర్తిని చాటాలని, యువత, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకుంటూ సామాజిక న్యాయం కోసం మరింత బలంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మాస్కు యాదయ్య, ఉపాధ్యక్షుడు చిన్నోళ్ల యాదయ్య, యాచారం అధ్యక్షుడు మాస్కు మహేందర్, చింతపట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు కొండు శంకర్, ఎంఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు సత్యం, వీఎచ్‌పీఎస్ చింతపట్ల అధ్యక్షుడు చెక్క రాజు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాస్కు యాదగిరి, కొమగల రాజు, కుంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. “జాతి హక్కుల సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేద్దాం – ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం” అని నాయకులు పిలుపునిచ్చారు.

జులై 7న గ్రామ గ్రామాన MRPS జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల నాయకుల పిలుపు

ఇబ్రహీంపట్నం/యాచారం, జులై 6: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ (MRPS) జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని MRPS మండల అధ్యక్షుడు మూలి మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని, ఈ ఉద్యమంలో ఎంతో మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమకారులు పోలీసుల లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదని, జాతి భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం పోరాడిన ఘనత ఎమ్మార్పీఎస్‌కే దక్కుతుందని అన్నారు. ఉద్యమ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, గత 32 సంవత్సరాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు కొనసాగించడం గర్వకారణమని తెలిపారు.

ఎమ్మార్పీఎస్ ఉద్యమాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిందని, సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకం అమలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు వంటి అనేక ప్రజా సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం చేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించిందని, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజల హక్కులను సాధించడంలో ముందుండిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమ చరిత్ర జాతికి గర్వకారణమని ఆయన అన్నారు.

జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి, ఉద్యమ స్ఫూర్తిని చాటాలని, యువత, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకుంటూ సామాజిక న్యాయం కోసం మరింత బలంగా ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మాస్కు యాదయ్య, ఉపాధ్యక్షుడు చిన్నోళ్ల యాదయ్య, యాచారం అధ్యక్షుడు మాస్కు మహేందర్, చింతపట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు కొండు శంకర్, ఎంఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు సత్యం, వీఎచ్‌పీఎస్ చింతపట్ల అధ్యక్షుడు చెక్క రాజు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాస్కు యాదగిరి, కొమగల రాజు, కుంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

“జాతి హక్కుల సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేద్దాం – ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం” అని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.