Wednesday, 9 September 2026
  • Home  
  • NRSTC కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి:– గిరిజన విద్యార్థి సంఘం,జిల్లా అధ్యక్షులు మణుగూరు బాబుజీ డిమాండ్.
- అల్లూరి సీతారామరాజు

NRSTC కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి:– గిరిజన విద్యార్థి సంఘం,జిల్లా అధ్యక్షులు మణుగూరు బాబుజీ డిమాండ్.

పెదబయలు మండలంలోని గిరిజన ప్రాంతాల్లో మంజూరై పెండింగ్‌లో ఉన్న నాన్-రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను(NRSTC) వెంటనే ప్రారంభించాలని గిరిజన విద్యార్థి సంఘం, జిల్లా అధ్యక్షులు మణుగూరు బాబుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది పేద గిరిజన విద్యార్థులు, బడి బయట ఉన్న పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.అయితే, మండలంలో కొత్తగా శాంక్షన్ అయిన కొన్ని కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉండిపోవడం విచారకరమన్నారు. అలాగే గత ఏడాది విజయవంతంగా నడిచిన కొన్ని కేంద్రాలను ఈ ఏడాది పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల పిల్లలు సాధారణ పాఠశాలలకు వెళ్లాలంటే సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని, దీంతో వారు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.గిరిజన బిడ్డల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పెండింగ్‌లో ఉన్న కొత్త కేంద్రాలతో పాటు, పాత కేంద్రాలలో కూడా వెంటనే తరగతులు ప్రారంభించి పేద విద్యార్థులకు తోడ్పాటు అందించాలని బాబుజీ ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.