నాగర్కర్నూల్
యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని మన సేవా సమితి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కార్యదర్శి సైదులు పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేదలకు చేయూతనందించడం, బాధితులకు భరోసా కల్పించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని అన్నారు. మన సేవా సమితి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ ఆర్ఎమ్ఓ డాక్టర్ ఏ.రోహిత్ కుమార్ ప్రారంభించారు. సమాజ సేవలో యువత ప్రతి ఒక్కరు బాధ్యత యుక్తంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రోహిత్, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి,రియాజ్, సూపర్వైజర్ నాగరాజు, మహేష్, శివశంకర్, రాజశేఖర్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NGKL: సేవా దృక్పథంతో యువత ముందుకు సాగాలి…
నాగర్కర్నూల్ యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని మన సేవా సమితి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కార్యదర్శి సైదులు పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేదలకు చేయూతనందించడం, బాధితులకు భరోసా కల్పించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని అన్నారు. మన సేవా సమితి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ ఆర్ఎమ్ఓ డాక్టర్ ఏ.రోహిత్ కుమార్ ప్రారంభించారు. సమాజ సేవలో యువత ప్రతి ఒక్కరు బాధ్యత యుక్తంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రోహిత్, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి,రియాజ్, సూపర్వైజర్ నాగరాజు, మహేష్, శివశంకర్, రాజశేఖర్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

