నంద్యాల మండలం పుసులూరు, మిట్నాల, కొత్తపల్లి గ్రామాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ వి. జయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని 29 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి, మొక్కజొన్నకు బదులుగా మినుము, కంది, జొన్న వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. నీటిని ఆదా చేసేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను వినియోగించాలని తెలిపారు. పంటలకు అవసరమైన పోషకాలను పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా వర్షాభావ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి పంటలు సాగు చేయాలి
నంద్యాల మండలం పుసులూరు, మిట్నాల, కొత్తపల్లి గ్రామాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ వి. జయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని 29 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి, మొక్కజొన్నకు బదులుగా మినుము, కంది, జొన్న వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. నీటిని ఆదా చేసేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను వినియోగించాలని తెలిపారు. పంటలకు అవసరమైన పోషకాలను పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా వర్షాభావ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు.

