డుంబ్రిగుడ మండలం, పోతంగి పంచాయతీ పరిధిలోని చాపరాయి ప్రాంతంలో ఎంపీటీసీ సింహాద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి గిరిజన ప్రాంత అభివృద్ధితో పాటు పేదలు, చిరు వ్యాపారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కిడారి కోరారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం లక్ష్యమని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కనీస వేతనాల డైరెక్టర్ సుబ్బారావు, మాజీ సర్పంచులు బాకూరు వెంకట రమణ రాజు, పాండురంగ స్వామి, టీడీపీ నాయకులు రవి, సింహాద్రి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


