నెల్లూరు వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య ఆశ్రమానికి ప్రముఖ ఫిజీషియన్, మధుమేహ నిపుణుడు డాక్టర్ టి.వి. కోటేశ్వరరావు, ప్రముఖ గైనకాలజిస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. లక్ష్మి దంపతులు అనాథ చిన్నారుల విద్య కోసం రూ.1 లక్ష విరాళం అందజేశారు. యూనిఫాంలు, పుస్తకాలు, ఫీజుల కోసం ఈ సహాయం అందించారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను ఆడంబరంగా జరుపుకోకుండా ప్రతి ఏడాది ఆశ్రమానికి విరాళం అందించడం అభినందనీయమని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు కొనియాడారు. సమాజ సేవతో పాటు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ దంపతులకు వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వి. సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారుల భవిష్యత్తుకు డాక్టర్ల చేయూత