నాగర్‌కర్నూల్, మే 19: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పోరుబాట పాదయాత్రకు నిర్ణయించడంతోనే సీఎం రేవంత్‌రెడ్డిలో కదలిక వచ్చిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 90 శాతం పూర్తయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లకు పైగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాలువల టెండర్లు రద్దు చేసి కాలయాపన చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోందన్నారు. నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు చేపట్టే పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు.

NGKL: బీఆర్ఎస్ పోరుబాటతోనే సీఎం సమీక్ష: మర్రి జనార్దన్ రెడ్డి