అభ్యుదయ కవితా కేతనం అక్షర చైతన్య సారథి మహాకవి దాశరధి
…. జయంతి సభలో నల్లా నరసింహమూర్తి
అమలాపురం జూలై 22
తెలుగు సరస్వతి దేవి ముద్దుబిడ్డ
అక్షర శిఖరం అగ్నిధార మహాకవి దాశరధి అని శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్, నల్లా నరసింహమూర్తి అన్నారు.
అమలాపురం శ్రీ శ్రీకళా వేదిక జిల్లా శాఖ మరియు కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి దాశరధి జయంతి సభ అమలాపురం లో జరిగింది. సభలో నరసింహమూర్తి దాశరధి కవితా వైభవం అనే అంశంపై ప్రసంగించారు.
నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అంటూ దాశరధి సర్వ మానవ సౌభ్రాతృత్వానికోరుకున్నాడని, ఆయన అక్షరాలు చైతన్య అగ్ని శిఖరాలని,
ఉర్దూ పారళీక కవిత్వపు సొంపులను దాశరథి గాలిబ్ గీతాలుగా అందించిన అభ్యుదయ కవితా చక్రవర్తి డాక్టర్ దాశరధి అని ఆయన అన్నారు.”నా తెలంగాణ కోటి రత్నాల వీణ “అని సగరవంగా చాటిన నవ్య కవితా వైతాళికుడు దాశరధి అని ఆయన అన్నారు. చలనచిత్ర పాటల్లో కూడా అద్భుతమైన భావావిష్కరణలు చేశారని మనసు పాటలకు ఆత్రేయఎంత ప్రసిద్ధులో వీణ పాటలకు దాశరధి అంతా ప్రసిద్ధులని ఆయన అన్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో “నీవు లేక వీణ పలకలే నన్నది..”వంటి పాటలు జన హృదయాలలోనిలిచి ఉన్నాయని ఆయన అన్నారు.సభకు కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు బి .వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ
సినీ చరిత్రలోరెండువందలసీనీ గీతాలు రచించి సినీ ప్రేక్షకుల హృదయాలలో ఆనందం నింపారని అన్నారు ఆత్మీయ అతిథిగా శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగు అధ్యాపకులు మాకే బాలార్జున సత్యనారాయణ మాట్లాడుతూ దాశరధి రచించిన
తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని అన్నారు. అనంతరం దాశరధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాశరధి కవిత్వం పై కవి సమ్మేళనం జరిగింది.
కార్యక్రమంలో నిమ్మకాయల సురేష్, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి, జినిపే భీమారావు, కొత్తపేట , డాక్టర్ శ్రీపాద రామకృష్ణ పాల్గొన్నారు.


