Tuesday, 15 September 2026
  • Home  
  • N M M S సేవలకు ఆత్మీయ సన్మానం – మాదాబత్తుల నర్సింగరావు లక్ష్మీ దంపతులకు ఘన సత్కారం
- విశాఖపట్నం

N M M S సేవలకు ఆత్మీయ సన్మానం – మాదాబత్తుల నర్సింగరావు లక్ష్మీ దంపతులకు ఘన సత్కారం

ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ జి. మోహన్ రావు ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా,తగరపువలస, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ NMMS (National Means-cum-Merit Scholarship Scheme) శిక్షణా తరగతుల్లో భాగస్వాములై తమ విలువైన సేవలను అందించినందుకు ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మాదాబత్తుల నర్సింగరావు–లక్ష్మి దంపతులకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ జి. మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింగరావు–లక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి వారి సేవలను అభినందించారు. NMMS శిక్షణా తరగతుల్లో విద్యార్థులకు తమ అనుభవాన్ని పంచుకోవడంతో పాటు, వారి ప్రతిభను వెలికితీసేందుకు అందించిన సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సేవలకు గుర్తింపు.. స్ఫూర్తికి సన్మానం విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన NMMS శిక్షణా తరగతుల్లో పాల్గొన్నందుకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస వారు అందించిన ఆత్మీయ సన్మానం నర్సింగరావు–లక్ష్మి దంపతులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది. “NMMS శిక్షణా తరగతుల్లో పాల్గొన్నందుకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస వారి సన్మాన మధుర క్షణాలను మీతో…” అంటూ ఈ ఆత్మీయ కార్యక్రమానికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. విద్యారంగంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ జి. మోహన్ రావు ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమం

విశాఖపట్నం జిల్లా,తగరపువలస, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి):

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ NMMS (National Means-cum-Merit Scholarship Scheme) శిక్షణా తరగతుల్లో భాగస్వాములై తమ విలువైన సేవలను అందించినందుకు ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మాదాబత్తుల నర్సింగరావు–లక్ష్మి దంపతులకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు.

ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ జి. మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింగరావు–లక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి వారి సేవలను అభినందించారు.

NMMS శిక్షణా తరగతుల్లో విద్యార్థులకు తమ అనుభవాన్ని పంచుకోవడంతో పాటు, వారి ప్రతిభను వెలికితీసేందుకు అందించిన సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

సేవలకు గుర్తింపు.. స్ఫూర్తికి సన్మానం

విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన NMMS శిక్షణా తరగతుల్లో పాల్గొన్నందుకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస వారు అందించిన ఆత్మీయ సన్మానం నర్సింగరావు–లక్ష్మి దంపతులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది.

“NMMS శిక్షణా తరగతుల్లో పాల్గొన్నందుకు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తగరపువలస వారి సన్మాన మధుర క్షణాలను మీతో…” అంటూ ఈ ఆత్మీయ కార్యక్రమానికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.

విద్యారంగంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.