దగదర్తి, సెప్టెంబర్ 23:దగదర్తి పున్నమి ప్రతినిధి (ముత్యాల గిరి )
దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు మరియు దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ అభ్యర్థన మేరకు దగదర్తి మండలం, తురిమెర్ల గ్రామ వాస్తవ్యులైన గెండి శివకృష్ణ కుమారుడు గెండి శ్రీనివాస్ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు ప్రతిపాదనలు పంపగా వారికి ఈరోజు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చేతులమీదుగా దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో రూ.91,228/- సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించడం జరిగింది. ఈ సందర్భంగా తురిమెర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లం రమేష్, హరి, బ్రహ్మం తదితరులు ఉన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాలేపాటి కుటుంబ సభ్యులకు, వి.పి.ఆర్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు.



