ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ CPM నాయకులు శనివారం ఖమ్మం నగరంలోని NST రోడ్డులో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హత కలిగిన ఓటర్లను తొలగించే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్ల హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.



