Wednesday, 6 May 2026

Blog

హెల్త్ టిప్స్

*రేషన్ బియ్యం లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి*

(పున్నమి ప్రతినిధి) రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ ఉండటం వల్ల రక్తహీనత వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. ఆన్లైన్‌లో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం వల్ల కొన్ని రేషన్ షాపుల వద్ద తాత్కాలికంగా స్టాక్ సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపిన నేపథ్యంలో, ఆయన జిల్లా పౌర సరఫరాల శాఖ సూపరిటెండెంట్ లక్ష్మీనారాయణ రెడ్డిని కార్యాలయంలో కలిసి ఫిర్యాదులు అందజేశారు. బియ్యం తీసుకోనంత మాత్రాన వైట్ కార్డు రద్దు అవుతుందన్నది అపోహ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రైతుల ధాన్య కొనుగోలు చెల్లింపులు 24 గంటల్లో ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. స్టాక్ సమస్య ఉన్న రేషన్ షాపులకు తక్షణమే సరుకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలం బద్వేల్ గ్రామంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధ మనుబోలు మండలం బద్వేల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తనతో పాటు పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై చర్చించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత పనితీరు వివరాలు తెలియజేసి, తల్లిదండ్రులతో సూచనలు పంచుకున్నారు. తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పిల్లల చదువులో మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల కోసం పాఠశాలలో మరిన్ని సదుపాయాలు కల్పించాలని కూడా సూచించారుఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశి కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకు సన్మానం కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చందన సురేష్ శైలజ చెంచు కృష్ణ రేఖా రాణి ప్రమీల వీరబ్రహ్మయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఈరోజు శ్రీకాకుళంలో

పూర్వపు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ బలివాడ మల్లేశ్వరరావు గారు పూర్వపు జిల్లా పరిషత్ సీఈవో సురంగి మోహన్ రావు గారి చేతులు మీదగా వావిలిపల్లి రాజారావు గారికి జ్ఞాపిక అందజేస్తున్న దృశ్యం.

ఆంధ్రప్రదేశ్

తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో

ఈరోజు తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో శాంతినికేతన్ కళాశాలలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేయుచున్న రచయిత వావిలిపల్లి రాజారావు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజనుల సంక్షేమo కోసం ….వారి బ్రతుకులో మార్పు కోసం చలో కలెక్టరేట్…..సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి

మర్రిపాడు:డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)” అనంతసాగరం మండల కేంద్రంలో ఉండే గిరిజనులకు ST కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సహాయ సహకారాలు అందించి వారి జీవితాలు బాగుచేయాలని కోరుతూ సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యం లో ఛలో కలెక్టరేట్ కు తరలిన గిరిజనులు….ST కార్పొరేషన్ ద్వారా తమకు సహాయం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది….*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఘనంగా యూటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశాలు*

*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండల కేంద్రం నందలి జీ.ఆర్.ఎన్ యూటీఎఫ్ భవన్ నందు యూటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశాలు మండల అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.పై సమావేశము నందు మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.యూ.టీ.ఎఫ్ మర్రిపాడు గౌరవ అధ్యక్షులుగా ఐ.భాస్కర్,మండల అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా కటారి సుధాకర్,కోశాధికారిగా షేక్ అబ్దుల్ మునాఫ్,ఎఫ్ డబ్లు ఎఫ్ కన్వీనర్ గా ఎన్.వెంకటేశ్వర్లు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.పై సమావేశమునకు జిల్లా కార్యదర్శి హెచ్ మోహన్ ప్రసాద్,జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ డైరెక్టర్ షేక్ నాయబ్,యూ.టీ.ఎఫ్ సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి,షేక్ ఇస్మాయిల్,రత్తయ్య,శ్రీనివాసులు,గురవయ్య,వెంగయ్య,వెంకటేశ్వర్లు,రఫీ, వెంకటయ్య,దావూద్ మండల బాధ్యులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సాహో ఫౌండేషన్ వారిచే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*.

*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 350 మంది విద్యార్థులకు సాహో ఫౌండేషన్ మర్రిపాడు వారి సహకారంతో ఇంగ్లీషు విషయ నిపుణుడు ఉమామహేశ్వరరావుచే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించబడ్డ ఇంగ్లీషు మెటీరియల్ ను మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిష్ బిట్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత,సాహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఒక ముఖ్యమైన మైలురాయి అనీ,అత్యుత్తమ మార్కుల సాధన కోసం,విద్యార్థులు కష్టతరంగా భావించే ఇంగ్లీషు విషయానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించి మండలం లోని అందరు విద్యార్థులకు అందించడం జరిగిందనీ,విద్యార్థులు ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు.మండల విద్యాశాఖ అధికారి-1 తిరుపతయ్య మాట్లాడుతూ మండలంలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 ధనలక్ష్మి,కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,స్టడీ మెటీరియల్ రూపకర్త ఉమామహేశ్వరరావు,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,మండలంలోని అన్ని పాఠశాలల ఇంగ్లీషు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆపన్నహస్తం

-కుమ్మరపల్లిలో లబ్ధిదారురాలికి రూ. 39,205 చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ -ప్రజల కష్టకాలంలో వెంటనే స్పందించడం ప్రభుత్వ లక్ష్యం: నాయకుల ఉద్ఘాటన చిట్వేలి, డిసెంబర్ 8: పున్నమి ప్రతినిధి ప్రజల అత్యవసర సమయాల్లో అండగా నిలబడి, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. -చెక్కు అందజేత: చిట్వేలి మండలం, నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కట్ట సుమిత్ర చెందిన ఆర్థిక సాయం చెక్కును సోమవారం ఆమె స్వగృహం వద్ద అందజేశారు. సుమిత్ర గారికి రూ. 39,205/-(ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు) విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అరవ శ్రీధర్ పాటు, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి సంయుక్తంగా అందజేశారు. -అరవ శ్రీధర్ గారి ప్రసంగం: ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ… “కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే ఎంతోమంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. విద్య, వైద్యం వంటి అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫండ్‌ను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం కృషి చేయాలని” కోరారు. -ముక్కా వరలక్ష్మి వ్యాఖ్యలు ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ… “సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రజల కష్టకాలంలో నిజమైన ఆదారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం నేరుగా చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కష్టాల్లో ఉన్నవారు ధైర్యాన్ని కోల్పోకుండా, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. లబ్ధిదారురాలికి సాయం అందించడం తమకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. -పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో అధికార కూటమి (ఎన్డీఏ) నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల లబ్ధిదారురాలు సుమిత్ర గారు మరియు ఆమె కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతను తెలియజేశారు.

తెలంగాణ

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఆకట్టుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సందర్శకుల దృష్టిని దోచుకున్నది ప్రత్యేక రోబో. వీఐపీలకు మనిషిలా నడుచుకుంటూ స్వాగతం పలుకుతూ అందరి ఆకర్షణగా నిలిచింది. దాని చురుకైన యాక్టివిటీస్, స్పందన గెస్టులకు విశేషంగా నచ్చాయి. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, భారతదేశం నలుమూలల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాల్గొనడం సమ్మిట్‌కి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

తెలంగాణ

ఆత్మీయత సేవా సొసైటికి నేషనల్ గౌరవం – బయ్యన మహేందర్ గారికి ‘గోల్డెన్ నంది అవార్డు–2025

గత 8 సంవత్సరాలుగా ఆత్మీయత సేవా సొసైటి ని ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ నుండి చేస్తునందుకు మనం ఫౌండేషన్, కడప వారు ఈ నెల 27 వ తేది నా హైదరాబాద్ లో జరుగు అవార్డ్స్ వేడుకలో ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారికి ” Best Sewa Golden Nandi National Award 2025″ ని బహుకరించడం జరుగుతుందని, మనం ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ Dr. K. చక్రవర్తి గారు తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా మనం ఫౌండేషన్ చైర్మన్ గారికి ఆత్మీయత సేవా సొసైటి ఫౌండర్ & అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ సేవా కార్యక్రమములకు సహకరిస్తున్న సొసైటి సభ్యులకు మరియు దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు బయ్యన మహేందర్ గారు తెలియజేయడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.