Wednesday, 6 May 2026

Blog

తెలంగాణ

ఆత్మీయత సేవా సొసైటికి నేషనల్ గౌరవం – బయ్యన మహేందర్ గారికి ‘గోల్డెన్ నంది అవార్డు–2025

గత 8 సంవత్సరాలుగా ఆత్మీయత సేవా సొసైటి ని ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ నుండి చేస్తునందుకు మనం ఫౌండేషన్, కడప వారు ఈ నెల 27 వ తేది నా హైదరాబాద్ లో జరుగు అవార్డ్స్ వేడుకలో ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారికి ” Best Sewa Golden Nandi National Award 2025″ ని బహుకరించడం జరుగుతుందని, మనం ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ Dr. K. చక్రవర్తి గారు తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా మనం ఫౌండేషన్ చైర్మన్ గారికి ఆత్మీయత సేవా సొసైటి ఫౌండర్ & అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ సేవా కార్యక్రమములకు సహకరిస్తున్న సొసైటి సభ్యులకు మరియు దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు బయ్యన మహేందర్ గారు తెలియజేయడం జరిగినది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో హెల్మెంట్ పంపిణీకి సహకరించిన వారిని సన్మానించిన డి.ఎస్.పి .సీఐ.ఎస్ఐ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన స్థానిక నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలను డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గార్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు. సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి అభినందించారు. అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక అలవాటు అని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మనుబోలు టిడిపి నాయకులు రాజా గౌడ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు

డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ * డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండియన్ నాలెడ్జి కమిటీ వారు శ్రీమతి కె .శశి, డాక్టర్ అయినవోలు మంజుల పాల్గొని శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవటం జరిగినది .ఈ సదస్సు శ్రీ చైతన్య సరస్వతి math,వెస్ట్ బెంగాల్ మరియు పిబి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసినది.

ఆంధ్రప్రదేశ్

దాత ఆశయానికి తూట్లు… వెయ్యి కోట్లు విలువైన ఆనంద నిలయం భూమిపై అక్రమార్కుల పాగా… అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కొండబాబు ఘాటైన ఆరోపణలు… త్వరలోనే ఆనందనిలయం ఆస్తుల పరి రక్షణ కు ప్రజా ఉద్యమానికి సన్నాహాలు..

కాకినాడ, కాకినాడ జిల్లా, పున్నమి ప్రతినిధి: పిఠాపురం మహారాజా చిన్నారుల విద్య–వికాసం కోసం అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు. ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకుచోటుచేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికే తూట్లు పొడుస్తున్నాయని ఆయన తీవ్రఆగ్రహంవ్యక్తంచేశారు.ఆదివారం ఆనందనిలయం ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డి దోవలో పాగా వేయడానికి పన్నాగం పన్నెరని తెలిపారు. వారి ఆటలు ఇక సాగవని.ఎవరు కొనడానికి ముందుకొస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కాకావికాలం చేసిందని ఆయన మండిపడ్డారు.1910 సంవత్సరంలో దాత ఈ భూమిని దానం గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తుచేస్తూ,మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు. దాత ధర్మాన్ని కాపాడాలన్నారు. భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతిగా మారుస్తున్నారని చెప్పారు.కాకినాడలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు,ఆర్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర పుస్తకావిష్కరణ

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో వెలసియున్న శ్రీ సంకల్ప సిద్ధి వినాయక ఆలయంలో రిటైర్డ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ APSPDCL రాజేంద్రన్ ధర్మపత్ని అయిన కీ.శే. రమాదేవి జ్ఞాపకార్థం శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర సంక్షిప్త విశేషాల పుస్తకాన్ని పూజ చేసి ఆవిష్కరించడం జరిగినది.

తిరుపతి

AMC చైర్మన్‌ల రాష్ట్ర ఆత్మీయ సమావేశంలో రైతుసమస్యలపై మాట్లాడిన రంగినేని

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: విజయవాడలోని ఆర్.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు వేదికపై ప్రసంగింస్తూ.. రైతుల సమస్యలు, మార్కెట్ ఆధునీకరణ, పారదర్శక సేవల ప్రాముఖ్యతలను ఆయన ప్రసంగంలో వివరించారు. అనతరం జరిగిన ఏఎంసీ చైర్మన్‌ల సన్మాన సభలో చెంచయ్య నాయుడు కూడా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల చైర్మన్‌లు హాజరైన ఈ సమావేశంలో తాజా వ్యవసాయ విధానాలు, మార్కెట్ అభివృద్ధి మార్గదర్శకాలు, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇతర చైర్మన్‌లతో స్నేహపూర్వకంగా చర్చించారు.

తిరుపతి

చెవిరెడ్డి జయమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డిల మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ ఇటీవల మృతి చెందారు ఆదివారం నాడు వారి స్వగ్రామం పుల్లారెడ్డి కండిగ గ్రామంలో నిర్వహించిన చెవిరెడ్డి జయమ్మ కర్మక్రియలులో మధుసూదన్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యున్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, ఫట్రాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ఫజల్, వెంకటయ్య, యుగంధర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

గోల్డ్ మెడల్ సాధించిన బాడిబిల్దర్ జావిద్ కి సన్మానం

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ జావిద్ దేహదారుడ్య పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినందుకు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా సిరాజ్ మాట్లాడుతూ… గత నెల 27,28,29 తేదీలలో జరిగిన నేషనల్ నాచురల్ బాడీబిల్డింగ్ కాంపిటీషన్ (ICN గోవా సూపర్ షో) లో పాల్గొన్న మొదటి ఈవెంట్ లోనే తను గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని ఈ కాంపిటీషన్ కి పాల్గొనడానికి దేశానలుముల నుంచి 1000కి పైగ పోటీదారులు పాల్గొనడంతో అందులో మన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ జావిద్ గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు కామీవెంకటేశ్వర్లు. ఎక్స్ కౌన్సిలర్ సురా గారి రమేష్ మాతయ్య జిల్లా యాంటీ కరప్షన్ అధ్యక్షులు లాలు శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.