Wednesday, 6 May 2026

Blog

తూర్పు గోదావరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 7 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామవాసి అయిన డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి, సీరియల్ నెంబర్ 19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేయుచున్నట్లు తెలిపారు. ఫార్మసీ మిత్రులు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకొని తమని గెలిపించమని కోరి ప్రార్ధించారు.

తూర్పు గోదావరి

బస్సుల కొరతతో ప్రజలు ఇక్కట్లు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి గోపాలపురం మీదుగా వచ్చే బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు కొవ్వూరు, తాళ్లపూడి, అన్నశదేవరపేట, చిట్యాల, గోపాలపురం మీదుగా జంగారెడ్డిగూడెం తిరుగుతూన్న బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు END

అన్నమయ్య

కువైట్‌లో రాజంపేట జిల్లా కేంద్రం కోసం సంఘీభావ సమావేశం ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహణ

రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాజంపేటలో జరుగుతున్న ప్రజా ఉద్యమానికి సంఘీభావంగా,కువైట్‌లోని రాజంపేట ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజలు శనివారం ఐక్యంగా సమావేశమయ్యారు. ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తమ స్వస్థల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా ఏర్పాటు సాధనకై రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం కీలకం అవుతుందని సమావేశంలో స్పష్టం చేశారు.రాజంపేటలో ఉధృతంగా సాగుతున్న ప్రజా ఆందోళనలకు, కువైట్‌లో నివసిస్తున్న రాజంపేట ప్రజలంతా పూర్తి మద్దతు ప్రకటించారు.“మా స్వరం రాజంపేట వరకు చేరే వరకు, మా న్యాయ డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని సమావేశంలో నాయకులు హామీ ఇచ్చారు.ఈ సంఘీభావ సమావేశంలో ధరురు బలరాం నాయుడు, ఓలేటి దివాకర్, మాలేపాటి సురేష్ బాబు, మాలేపాటి బాబు, పోలారపు బాబు, ములక రవి, రమేష్ దుగ్గినేని, మురళి, మదిన ఈశ్వర్, వీరబల్లి అంజి రెడ్డయ్య, నాయుడు సుదర్శన్, మాలార్పు భాస్కర్, కూరపాటి చంద్ర, పూరపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

పున్నమి ప్రతినిధి ఎలక్షన్ కోడ్ అమల్లో……… భారీగా అక్రమ మద్యం స్వాధీనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె మధు, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్, చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని మద్యాన్ని తరలించడానికి వాడిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ రోజు సొసైటీ వారి రంగోలి హేళ విజేతలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు..,

ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ వారు నిర్వహించిన రంగోలి పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిని సాధించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల …. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి అనీమియా అవగాహన మరియు హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ ప్రోగ్రాం

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో అనీమియా అవగాహన కార్యక్రమం మరియు హీమోగ్లోబిన్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని డాక్టర్ జాస్మిన్ సుల్తానా గారి ద్వారా నిర్వహించారు. ఆమె పిన్నమనేని సిద్దార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గన్నవరం‌లోని ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ విభాగం బ్లడ్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. కార్యక్రమంలో మేడమ్ అనీమియాకు కారణాలు, అనీమియా వల్ల కలిగే సమస్యలు అలాగే రక్తాన్ని పెంచే ఐరన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి కలసల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విభాగ అధ్యాపకులు Ch. Gayathri, Tehamina, T Kundana మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

రంగారెడ్డి

*సంస్థాన్ అభివృద్ధి చేసేవారికి ఓటేద్దాం.! ఊరికి సేవ చేసేవాడికె అవకాశం ఇద్దాం.! మన ఊరు – మన ఓటు గ్రామ అభివృద్ధి మన బాధ్యత – మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 :సంస్థాన్ నారాయణపురం మాజీ గ్రామ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు, గత ఏడు సంవత్సరాలుగా గ్రామా అభివృద్ధికి గ్రామ ప్రజలకు సేవ చేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని ఉప్పల లింగస్వామి అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక లక్ష్యంతో ఏడు సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మనలో ఒక్కడి గా మన మధ్య తిరుగుతున్న ఆ నాయకుడికి అవకాశం కల్పిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అండతో, మునుగోడు ఎమ్మెల్యే రాజన్న ఆశీస్సులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన ముందుకు సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ అభ్యర్థిగా ఉప్పల విజయలక్ష్మి- లింగస్వామి కి మన ఊరు- మన ఓటు- మన బాధ్యతగా వారినకి ఓటు వేసి గెలిపించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు,

విశాఖపట్నం

ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*

*ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చొరవతో వేదాంత కంపెనీవారి ఆర్థిక సహాయంతో ఈ రోజు జగదాంబ జంక్షన్ దగ్గర అంబికా బాగ్ లో దక్షిణ నియోజకవర్గం పేద మహిళలకు ఉచితంగా 75 మందికి కుట్టు మిషన్ లు పంపిణి చేశారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పేద మహిళలు తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం లో భాగంగా ఈ రోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫౌండ్స్ ద్వారా వేదాంత కంపెనీ చేస్తున్న అభివృద్ధి పనులలో భాగంగా ఈ కుట్టు మిషన్ లు పంపిణి చేసారన్నారు, ప్రతి మహిళా స్వయం ప్రతిపత్తి సాధించేలా అభివృద్ధి సాదించాలి అని అన్నారు, ఇలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తు లో వేదాంత వారి ప్రోత్సాహంతో మరిన్ని చెప్పడతామని అన్నారు, ఈ కార్యక్రమం లో లబ్ధిదార మహిళలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సేవలు మరువలేనివని,ఎమ్మెల్యే గారికి, వేదాంత కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు, ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో పాటు వేదాంత కంపెనీ తరుపున శ్రీ లక్ష్మి గారు పాల్గొన్నారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

విశాఖపట్నం

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * – ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులకూ చేయూత ఇస్తాం – కొండపల్లి శ్రీనివాసరావు, ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్, శాఖల మంత్రి సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్ తదితర శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్, పాట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. రైతులకు చేయూత ఇవ్వడం లో తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. గ్రామీణ రైతుల ఎఫ్ పిఒల ద్వారా గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం సెక్రటరీ చిరంజీవి చౌదరి, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాబార్డ్ రిటైర్డ్ ఎం డి సూర్య కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం అశోక్, ప్రకృతి రైతులు పిఎల్ఎన్ రాజు, ఎన్ నరేంద్ర, రిషి, శంకర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతులు , సిద్ధ వైద్యులు పాల్గొన్నారు. ఈ మేళా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

విశాఖపట్నం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి. *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- సమాజంలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి జీవితాలలో వెలిగి నింపిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఈ పుడమి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మనీయునిగా ఉంటారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా భారత దేశ రాజ్యాంగాన్ని రచనలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జివిఎంసి సూపరింటెండెంట్ లు రియాజ్ ,శ్రీనివాస్ , ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.