Wednesday, 6 May 2026

Blog

కడప

మైదుకూరు లో మూత్రశాలలు లేక ఇబ్బందులు*

*మైదుకూరు లో మూత్రశాలలు లేక ఇబ్బందులు*. . ఊరంతా చుట్టాలే ఉ.. పోసుకోవడానికి తావులేదు అన్న సామెత మైదుకూరులో గుర్తొస్తోందంటున్నారు ప్రజలు. . ఊర్లో ఇంత అభివృద్ధి చెందుతున్న ఉ.. పోసుకోవడానికి ప్రజలకు మరుగుదొడ్లు లేని పరిస్థితి.. నిత్యం మైదుకూరు పట్టణం కు అనేక గ్రామాల నుండివేలసంఖ్యలో ప్రజలు మహిళలు పనుల నిమిత్తం కూరగాయలు ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం వస్తుంటారు.. మగవారైతే ఎలాగోలా పాటుపడతారు గాని అత్యవసర పరిస్థితి లో మహిళలు మూత్రశాలకు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి .. గతంలో పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్లు ఉండేవి నేడు అవి కనిపించడం లేదు.. నిత్యం రద్దీగా ఉండే బద్వేల్ రోడ్డు కడప రోడ్డు లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుందంటున్నా ఇతర ప్రాంతాల ప్రజలు.. బద్వేల్ రోడ్డులో మురికి కాలువలపై మరుగుదొడ్లు నిర్మించడం ..కడప రోడ్డులో గతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్డి నిర్మించడం మేలంటున్నారు ప్రజలు.. ప్రజల అవస్థలు ముఖ్యంగా మహిళల అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల తో మున్సిపాలిటీ అధికారులు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ

డి ఆర్ సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి , పంపిణీ, స్వీకరణ ప్రక్రియను, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కేతపల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి, పంపిణీ, స్వీకరణ, కేంద్రాన్ని తనిఖీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాహనదారుడుకీ ప్రత్యేక కౌన్సిలిoగ్ ఇచ్చినా ఉదయగిరి సీఐ వెంకట్రావు

ద్విచక్ర వాహన దారుడికి హెల్మెట్ రక్షణ కవచంలా పని చేస్తుందని ఉదయగిరి సిఐ వెంకట్రావు తెలిపారు ఉదయగిరిలోని కరెంట్ ఆఫీస్ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక కౌన్సిల్oగ్ ఇచ్చారు ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉన్నాయని వివిధ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలంటే హెల్మెట్ తప్పని సరి అన్నారు మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని సూచించారు వారితో పాటు ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనా రెడ్డి ఉన్నారు.

తెలంగాణ

ఎటువంటి లోపాలు కనిపించకుండా సరిదిద్దుకోవాలన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎటువంటి లోపాలు కనిపించిన వెంటనే సరిదిద్దుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టర్ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రిని, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు.

E-పేపర్

రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు

పున్నమి ప్రతినిధి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ వేళ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులన్ని చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ రిలీజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చి, తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మా సిటీని రద్దు చేయలేదు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు చట్టం ప్రకారం, ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరు ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పి, కొత్త పర్యావరణ అనుమతులు పొంది, తిరిగి ప్రజా స్పందన చేసి భూసేకరణ చేయాలి.. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకం దీనికి తోడు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్దా గ్రామాలలో ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతం అని చూపించడం మోసం అలాగే గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు మా విజ్ఞప్తి ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసింది ప్రజా పాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోవొద్దంటూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఫార్మా సిటీ రెసిస్టెన్స్ కమిటీ

అల్లూరి సీతారామరాజు

అరకు: హెల్మెట్ ధారణపై అవగాహణ ర్యాలీ

అరకులోయ లో డిఎస్పి షేక్ సహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ చేపట్టారు. డిసెంబర్, జనవరి నెలలో పర్యాటకుల రాక పెరిగి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో హెల్మెట్ పై అవగాహణ పరుస్తున్నామని డీఎస్పీ అన్నారు. పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు చోదకులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలన్నారు. కొత్త మోటర్ వాహన చట్టం నిబంధనలు తెలిపారు. అరకు సీఐ హిమగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎస్ఐ లు గోపాలరావు, పాపినాయుడు, శ్రీనివాసరావు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగo వారి గెస్ట్ లెక్చర్…

8 .12. 2025వ తేదీ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల,రసాయన శాస్త్ర విభాగం వారు RAINBOW WEEK CELEBRATIONS- 2025 లో భాగంగామొదటి రోజున గెస్ట్ లెక్చర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నన్నపనేని మాధవి , (ప్రొఫెసర్,HOD,పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ )గారు ముఖ్య అతిథిగా పాల్గొని *తాజా పరిణామాలు-పరిశోధన అవకాశాలు *అనే అంశంపై ఉపన్యసించారు. నానో కెమిస్ట్రీ అంశాలను అర్థవంతంగా విద్యార్థులకు వివరించారు. నానో స్థాయిలో పదార్థాలు పొందే ప్రత్యేక లక్షణాలు….. ఉపరితల ప్రాంతం పెరగడం, కొత్త రకాల ఎలక్ట్రిక్ మరియు ఆప్టికల్ లక్షణాల ప్రదర్శన లాంటి అంశాలను ఉదాహరణలతో చూపించారు. నానో పార్టికల్స్, నానో రాడ్స్, నానో ట్యూబ్స్, నానో ఫిలిమ్స్, నానో కంపోజిట్ వంటి రకరకాల నాను మెటీరియల్స్ ను చిత్రాలతో వివరించారు. వీటి తయారీ పద్ధతులు , ఉపయోగాలు మరియు డిమాండ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపన్యాసంలో అనంతరం సింథసిస్ పద్ధతుల గురించి లోతుగా చర్చించారు. ముఖ్యంగా టాప్ – డౌన్ మరియు బాటమ్- అప్, పద్ధతులు , తేడాలు, వాటి ప్రయోజనాలు గురించి విద్యార్థులతో చర్చించారు. గ్రాఫిన్ ,గ్రాఫిన్ ఆక్సైడ్, తయారీ గురించి మరియు రసాయన రేడక్షన్ పద్ధతి ద్వారా కాపర్ నానో పార్టికల్స్ తయారీలో ఉపయోగించే సోడియం బోరో హైడ్రేట్ ఆస్కారిక్ ఆమ్లం వంటి ప్రొడ్యూసింగ్ ఏజెంట్ల ప్రాముఖ్యత ను వివరించడమే కాకుండా నానో సైన్స్ ఎందుకు భవిష్యత్తు టెక్నాలజీకి బలమైన పునాది అవుతుందో వివరించి ,పరిశ్రమల్లో ఈ పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ ను, నానో పదార్థాల అనువర్తనను గురించి మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్ డెలివరీ క్యాన్సర్ చికిత్సలో నానో పార్టికల్స్ ద్వారా ట్యూమర్ కణాలను గుర్తించి చికిత్స చేయడం , బయోసెన్సర్లు, మెడికల్ ఇమేజింగ్, టిష్యూ ఇంజనీరింగ్, ఇలాంటి అనేక రకాల ఉపయోగాలను గురించి విద్యార్థులలో చక్కని అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రమణ్య కుమార్ గారు మాట్లాడుతూ రోజు రోజుకి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న శాస్త్రీయ ఆధునిక రంగాలపై అవగాహన కలగడం చాలా అవసరము అని ఈ లెక్చర్ విద్యార్థుల జీవితాలలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందింప చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ మాధవి…. (హెడ్ ఆఫ్ ద పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, JKC కాలేజ్ అటానమస్…. గుంటూరు) కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి ఎస్ కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి M. సుభాషిణి అధ్యాపకులు , లావణ్య, శ్యామల,రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేసిన యం.ఎల్. ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తిరుగుడు మెట్ట, అన్నదేవరపేట, తాళ్లపూడి మరియు చాగల్లు మండలం ఊనగట్ల, దారవరం, చాగల్లు, మార్కొండపాడు, చంద్రవరం గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన రూ. 6,01,327/- ల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ ,అర్జీల్లి రామకృష్ణ,ఆళ్ల హరిబాబు , సూరపని చిన్ని ,సూర్యదేవర రంజిత్ , బొడ్డు కేశవ్, కూచిపూడి గణపతి , పెనుమాక జయరాజు , దొంగ రామకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్: కోడూరులో ముక్కా రూపానంద రెడ్డి ప్రజా దర్బార్‌కు అపూర్వ స్పందన

రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించారు. రాఘవరాజాపురం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించిన ఈ దర్బార్‌కు కోడూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ వినతి పత్రాలతో వచ్చిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రూపానంద రెడ్డికి వివరించారు. తక్షణ పరిష్కారంపై దృష్టి:- ముక్కా రూపానంద రెడ్డి ప్రజల వినతులను స్వీకరించి, వాటిని పరిష్కరించడంలో ‘స్పీడ్’ చూపించారు. వెంటనే పరిష్కరించగలిగే సమస్యలకు సంబంధించి, ఆయన అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సమస్యలకు సంబంధించిన ఫైళ్లను స్వీకరించారు. వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. పాలనలో పారదర్శకతకు నిదర్శనం ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన కర్తవ్యమని పునరుద్ఘాటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసుకునేందుకు ఇలాంటి ప్రజాదర్బార్లు నిర్వహించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

*రేషన్ బియ్యం లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి*

(పున్నమి ప్రతినిధి) రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ ఉండటం వల్ల రక్తహీనత వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. ఆన్లైన్‌లో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం వల్ల కొన్ని రేషన్ షాపుల వద్ద తాత్కాలికంగా స్టాక్ సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపిన నేపథ్యంలో, ఆయన జిల్లా పౌర సరఫరాల శాఖ సూపరిటెండెంట్ లక్ష్మీనారాయణ రెడ్డిని కార్యాలయంలో కలిసి ఫిర్యాదులు అందజేశారు. బియ్యం తీసుకోనంత మాత్రాన వైట్ కార్డు రద్దు అవుతుందన్నది అపోహ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రైతుల ధాన్య కొనుగోలు చెల్లింపులు 24 గంటల్లో ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. స్టాక్ సమస్య ఉన్న రేషన్ షాపులకు తక్షణమే సరుకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.