అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజూ కళాశాలకు హాజరై అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోఆర్డినేటర్ కె. నిర్మల మాట్లాడుతూ నూతన విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలు డా. జి. సుధీర్, వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న మాట్లాడుతూ లైబ్రరీని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమ్యశ్రీ, సంధ్యారాణి, వార్డెన్ వైకుంఠం, విద్యార్థులు పాల్గొన్నారు.

అరకు: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి