Friday, 10 July 2026

Blog

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో “పాటల సవ్వడి”కి కళా ప్రియుల ఆహ్వానం

  నెల్లూరు: సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో 98వ కార్యక్రమంగా “పాటల సవ్వడి” పేరిట సాంస్కృతిక సంగీత సభ ఈ శనివారం (12.04.2025) సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరు టౌన్ హాల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నెల్లూరు ప్రాంతానికి చెందిన 40 మంది ప్రముఖ మరియు యువ గాయకులు భారతీయ సినిమాల్లోని అద్భుతమైన గీతాలను ఆలపించనున్నారు. సంగీత ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. సంస్థ సేవలు, స్థానిక ప్రతిభా అభివృద్ధికి చేసిన కృషి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఒక సంగీత పండుగగా మారనుంది. సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు తప్పక హాజరై ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంకీర్తన కళా సమితి సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మీ హాజరును ఆతురతతో ఎదురుచూస్తున్నాం.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దువ్వూరు రామిరెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహణ

నెల్లూరు: ప్రసిద్ధ కవి, చింతన కర్త దువ్వూరు రామిరెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మార్చి 4వ తేదీన నిర్వహించిన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరేబా ల కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీ దొడ్ల మురళీ కృష్ణా రెడ్డి, కుమారి ప్రవల్లిక, శ్రీమతి శ్రీదేవి, శ్రీ దగ్గుమాటి కృష్ణ, శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ జయ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి గూడూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దువ్వూరి గారి సాహిత్య సేవలను గుర్తు చేస్తూ వారందరూ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సభను బి. సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రటరీ, దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి నిర్వహించారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు వెదాయపాలెంలో ఆక్యుపంక్చర్ & రిఫ్లెక్సాలజీ వైద్య శిబిరం

ఆక్యుపంక్చర్ మరియు రిఫ్లెక్సాలజీ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతున్నాయి. శరీరంలోని ప్రత్యేక పాయింట్లను ఉద్దీపన చేయడం ద్వారా సహజ చికిత్సను అందించే ఈ పద్ధతులు, నాడీ సంబంధిత సమస్యలు, నొప్పులు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు వంటి అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెదాయపాలెంలో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఏప్రిల్ 14 (సోమవారం), 15 (మంగళవారం) తేదీలలో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే ఉద్దేశంతో విశ్రాంత ఆరోగ్య నిపుణులు వీటిని అందించనున్నారు. ఆసక్తి గల వారు ముందస్తు వివరాల కోసం కింది ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. విస్సా సత్యరాజు ఫోన్: 9444443590

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బి.సి.భవన్ మరోసారి రక్తదాన శిబిరం ప్రసాద్ పిలుపు కి యువత స్పందన

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) పూలే జయంతి సందర్భంగా బి‌‌సి ఐక్యతా భవన్ కావలి ఏరియా హాస్పిటల్ లో మరో సారి మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. భవన్ వ్యవస్థాపకులు, పాత్రికేయులు చిన్ని వరప్రసాద్ రక్తదాన కార్యక్రమం తో కావలి నలుమూలల నుంచి బలహీన వర్గాల నేతలను ఒక వేదిక మీదకు సమీకరించడం విశేషం. సుమారు నలభై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కావలి ఏరియా ఆసుపత్రి లో రక్తదానం చేయడం వలన ప్రజలకు నేరుగా ప్రతి రక్తపు చుక్క అందుతుందనే ఆశయం తో తమ సంఘం ఇక్కడే నిర్వహిస్తున్నట్లు వర ప్రసాద్ తెలిపారు. దేశ సేవ కోసం పూలే దంపతులు పిల్లలు వద్దనుకొని ఆదర్శ దంపతులయ్యారు. ఆనాటి కాలంలో మహిళలకు విద్య నిషేధం నడుస్తున్న తరుణంలో పూలే దంపతులు మహిళలకు, బాలికలకు విద్యను అందించిన ఘనత వారికే దక్కిందని వారికి భారతరత్న ఇవ్వాలని ప్రసాద్ కోరారు. రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన యువత సమాజ అభివృద్ధిలో కీలకం అయ్యేందుకు తమ బి.సి భవన్ కృషి చేస్తుందని ప్రసాద్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విజయవేణి మాట్లాడుతూ బి.సి భవన్ నిర్వాహకులు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతి సారి ఇక్కడే రక్తదానం చేయడం హర్షణీయం అని, ఏరియా ఆసుపత్రి కి ఎంతో అండగా నిలిచినట్లు అని అభినందించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనసేన కావలి ఇంచార్జి అళహరి సుధాకర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సహాయ కార్యదర్శి ముక్కు మురళీమోహన్ డాక్టర్ రోహిత్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సాయి, సేవా సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, రోటరీ క్లబ్ కార్యదర్శి మొగల్ సలీం, బిజెపి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ పూలమాల వేసి నివాళులు అర్పించి బి.సి ల‌సంక్షేమానికి పాటుపడుతున్న బి.సి.భవన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ ను అభినందించారు‌. వర ప్రసాద్ పిలుపు మేరకు యువకులు కొత్తగా స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం అని ప్రసాద్ భవిష్యత్తు లో బి.సి ల సంక్షేమం కు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ప్రశంసించారు. . బ్లడ్ వారియర్ టీం సభ్యులు వినయ్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ అలీం, షేక్ ఖరీర్బీ, సోమిశెట్టి బ్రహ్మయ్య, భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జీవో సిద్ధం!

  అమరావతి, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం కొత్త అక్రిడిటేషన్ జీవోను ఈ నెల 15వ తేది తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. పలు మార్పులతో, పకడ్బందీగా ఈ జీవోను తయారు చేసినట్టు సమాచారం. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా, ఈసారి ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జీవోలో పత్రికా ప్రతినిధుల అర్హతలు, ఫార్మాట్, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు స్పష్టంగా ఉండనున్నాయి. జీవో విడుదలైన వెంటనే, జర్నలిస్టులు ఆన్లైన్‌లో ఫోటోలు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అప్లికేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇకపై సమగ్ర సమాచారం, పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్‌తో మాత్రమే అక్రిడిటేషన్ మంజూరు కానుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నెల్లూరు జిల్లా పోలీసులు:అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH.సౌజన్య

నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) SPS నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారతీయ సామాజిక సంస్కర్త, మేధావి, రచయిత శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH. సౌజన్య , జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “జ్యోతిరావు పూలే గారు పాశ్చాత్య సమాజ రుగ్మతలను ఎదురించి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించి, వితంతువుల రక్షణ కోసం ఆశ్రమాలు నిర్మించారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేకు విద్యను నేర్పి, ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడం ద్వారా మహిళా విద్యకు మార్గం తీర్చారు. ఈయన ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకం,” అని తెలిపారు. జిల్లా పోలీసులు జయంతిని ఘనంగా నిర్వహించి, పూలే గారి సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాల సాధన దిశగా అందరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

అక్షర యోధుడికి శతకోటి వందనాలు…**

** విశాఖపట్నం తీరాన్ని తాకే ప్రతి పుటలో ప్రజల గొంతుకగా, వాస్తవాల వికాసానికి వేదికగా నిలిచిన అక్షర యోధుడు **ఓలేసి ప్రసాద్ రావు** గారు — పాత్రికేయ ధర్మాన్ని తన కలంతో నిలబెట్టిన అభినవ అనుభవ వీరుడు. **సీనియర్ పాత్రికేయుడు**, **సూర్య దినపత్రిక ఉత్తరాంధ్ర ప్రతినిధి**గా తన విలక్షణ రచనా శైలితో, సమాజంలోని నిస్సహాయుల ఆక్రందనను అక్షరాలుగా మలిచిన వారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆవిర్భవించిన **ఆదివాసి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా** ఆయన పోరాట పటిమ ప్రశంసనీయమైనది. నిరంతర సేవ, నిబద్ధత, మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదే పదే నిరూపించుకున్న ఈ గొప్ప పాత్రికేయునికి సన్మానం చేయటం మాకు గర్వకారణం. ఆయన కలం తూటాను తలపించి, నిజాన్ని నిర్భయంగా చెబుతుంది. ప్రజల గొంతుకగా నిలిచిన ఈ అభినవ పాత్రికేయునికి మా హృదయపూర్వక వందనాలు. **మీ కలం మాకు మార్గదర్శకం కావాలి…** **మీ పోరాటం మాకు ప్రేరణ కావాలి…** **మీ రచనలతో సమాజంలో మార్పు కొనసాగాలి…** శతజయంతి వరకు మీ సేవ జారదోర్లని కోరుకుంటూ, **ఈ గౌరవ సన్మానాన్ని అందిస్తున్నాం.**

Featured

అక్షర యోధుడికి శతకోటి వందనాలు…**

** విశాఖపట్నం తీరాన్ని తాకే ప్రతి పుటలో ప్రజల గొంతుకగా, వాస్తవాల వికాసానికి వేదికగా నిలిచిన అక్షర యోధుడు **ఓలేసి ప్రసాద్ రావు** గారు — పాత్రికేయ ధర్మాన్ని తన కలంతో నిలబెట్టిన అభినవ అనుభవ వీరుడు. **సీనియర్ పాత్రికేయుడు**, **సూర్య దినపత్రిక ఉత్తరాంధ్ర ప్రతినిధి**గా తన విలక్షణ రచనా శైలితో, సమాజంలోని నిస్సహాయుల ఆక్రందనను అక్షరాలుగా మలిచిన వారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆవిర్భవించిన **ఆదివాసి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా** ఆయన పోరాట పటిమ ప్రశంసనీయమైనది. నిరంతర సేవ, నిబద్ధత, మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదే పదే నిరూపించుకున్న ఈ గొప్ప పాత్రికేయునికి సన్మానం చేయటం మాకు గర్వకారణం. ఆయన కలం తూటాను తలపించి, నిజాన్ని నిర్భయంగా చెబుతుంది. ప్రజల గొంతుకగా నిలిచిన ఈ అభినవ పాత్రికేయునికి మా హృదయపూర్వక వందనాలు. **మీ కలం మాకు మార్గదర్శకం కావాలి…** **మీ పోరాటం మాకు ప్రేరణ కావాలి…** **మీ రచనలతో సమాజంలో మార్పు కొనసాగాలి…** శతజయంతి వరకు మీ సేవ జారదోర్లని కోరుకుంటూ, **ఈ గౌరవ సన్మానాన్ని అందిస్తున్నాం.**

E-పేపర్ Featured ఆంధ్రప్రదేశ్

ప్రస్తుత రాజకీయాలు కార్యకర్తలు ప్రజలు అర్ధం చేసుకో లేక పోతున్నారా????

ఆయన రాయలసీమకు చెందిన అధికారపార్టీ అయిన ‘టిడిపి’కి చెందిన కీలకమైన మంత్రి. అయితే తమ పార్టీ బద్దశత్రువైన మాజీ మంత్రి ‘ఆర్‌.కె.రోజా’ను ఆయన తన ఇంటికి ఆహ్వానించారని, ఆమెతో రాజకీయ చర్చలే కాకుండా..ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టారట. ‘విజయవాడ’లోని సదరు మంత్రి ఇంటికి వైకాపాకు చెందిన మాజీ మంత్రి ‘రోజా’ వెళ్లడం..తరువాత ఆమె పనులు చకచక అవడం..రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన తనయుడు ‘లోకేష్‌’లపై ఒంటికాలితో విరుచుకుపడే..‘రోజా’ను ఆ మంత్రి ఎలా తన ఇంటికి రానిచ్చారనే దానిపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. బద్దశత్రువును ఎలా రానిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోజా’ మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం..‘చంద్రబాబు’ను ‘లోకేష్‌’ను పరుషపదజాలంతో విమర్శలు చేసేది. ముఖ్యంగా ‘లోకేష్‌’ను వాడూ..వీడూ అంటూ నోరుపారేసుకుంది. అసెంబ్లీలో ‘చంద్రబాబు’ గురించి, ఆయన భార్య గురించి, ‘లోకేష్‌’ భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడేది. దీంతో..ఆమె విమర్శలపై టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..‘రోజా’ సంగతి చూస్తామని అప్పట్లో వారు..తెగ ఇదయ్యేవారు. కానీ..అధికారంలోకి వచ్చి పది మాసాలు అవుతున్నా..‘రోజా’ను ఇంత వరకు ఏమీ చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్లు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రులు అయినవారి ఆమెకు ఇంటికి ఆహ్వానాలు పంపుతున్నారట. రాయలసీమకు చెందిన ఈ మంత్రి వ్యవహారశైలిపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఆయన పట్ల ఎంతో ఔదార్యంతో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేతను నీచంగా దూషించిన వారిని ఇంటికి ఎలా రానిస్తున్నారని, నైతికంగా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటివి తగవని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

మజ్జిక పంపిణీ: జెర్రీపోతుల ముత్యాలు.

సత్య సాయిబాబా సమితి ఆధ్వర్యంలో జరిగిన మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన PCC అధికార ప్రతినిధి, AP Telangana State INTUC Vice President జెర్రీపోతుల ముత్యాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య సాయిబాబా సమితి సభ్యులు నరవ శ్రీను, కొండ బాబు, బాబురావు, కృష్ణ మరియు మహిళలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.