Friday, 10 July 2026

Blog

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయవంతంగా పింఛన్ల పంపిణీ: అత్తిపాటి శివకుమార్

విజయవంతంగా పింఛన్ల పంపిణీ పున్నమి న్యూస్ – కోవూరు నియోజకవర్గం జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మే 31వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, 5వ వార్డు ఇన్‌చార్జి శ్రీ అత్తిపాటి శివకుమార్ నేతృత్వంలో ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక వృద్ధులు, నిరుపేదలు, దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు రావలసిన పింఛన్‌ను సకాలంలో పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి అవ్యవస్థలకీ తావులేకుండా సజావుగా పింఛన్ల పంపిణీ జరగడం పట్ల స్థానికులు అధికారులపై హర్షం వ్యక్తం చేశారు.

Featured తెలంగాణ

కంటి పొరల సమస్యలపై ఉచిత శస్త్రచికిత్సలు – ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పెద్దలందరికీ భారీ ఉపశమనం

కంటి పొరల సమస్యలపై ఉచిత శస్త్రచికిత్సలు – ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పెద్దలందరికీ భారీ ఉపశమనం పున్నమి న్యూస్ – భూపాలపల్లి కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కంటి పొరల (క్యాటరాక్ట్) సమస్యతో బాధపడే వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, వారికి నిర్ధారిత వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా జూన్ 4, 2025 (బుధవారం) రోజు ప్రత్యేక బస్సు భూపాలపల్లికి వస్తుంది. అర్హులైన వృద్ధులను కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించి, అక్కడ నిపుణులైన డాక్టర్లచే కంటి ఆపరేషన్లు చేయబడతాయి. ఆపరేషన్ అనంతరం, నల్లటి కంటి అద్దాలు, నెలకు సరిపడా మందులు ఉచితంగా, పేషెంటు మరియు తోడొచ్చే వ్యక్తులకు ఉచిత భోజనం సైతం అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు 9440903023 నంబర్‌ను సంప్రదించవచ్చు. వెంట తీసుకురావాల్సినవి: ✅ ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ – 3 ✅ కలర్ ఫోటోలు – 3 ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మాట్లాడుతూ – “ప్రజాసేవే పరమోధర్మం అనే సూత్రంతో, ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ కడప

ప్రొద్దుటూరు చరిత్రను పాతరేయకండి – డాక్టర్ ప్రసాదరెడ్డి విగ్రహంపై తీవ్ర అభ్యంతరాలు

పున్నమి న్యూస్ – వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నడిబొడ్డులో డాక్టర్ ప్రసాదరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “ప్రొద్దుటూరు చరిత్రను పాతరేయకండి..!” అంటూ పలువురు సాహితీవేత్తలు, బుద్ధిజీవులు, యువత గళమెత్తుతున్నారు. ప్రొద్దుటూరు అంటే రెండో కాశీ, రెండో ముంబై, కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినిల్లు. దేశ వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన దసరా హరివిల్లు ఉత్సవాల కేంద్రం. గాంధీజీ అడుగులు వేసిన భూమి. శివతాండవం రచించిన మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల భూమి. వందల తరాలకు ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పోరాట పటిమ ఉన్న ప్రదేశం. అలాంటి ప్రఖ్యాతమైన ప్రొద్దుటూరులో డాక్టర్ ప్రసాదరెడ్డి విగ్రహాన్ని ఉంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు – ఆయన ఎవరు? ఉచిత వైద్యం చేశారా? ప్రజాసేవ చేశారా? సామాజికంగా ఏమి అందించారు? ప్రొద్దుటూరులోని పెద్దలు, గౌరవనీయులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై విసృత చర్చ జరపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రొద్దుటూరు చరిత్రను చెడగొట్టే ప్రయత్నాలు అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. “చరిత్రను కాపాడండి – గుర్తింపు చెల్లని విగ్రహాలకు చోటు లేదు” అనే పిలుపుతో ప్రజలు ఏకతాటిపైకి వస్తున్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయాన్నే మొదలైన రేషన్ పంపిణీ..*: బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు

* *పున్నమి ప్రతినిధి పొదలకూరు*: పట్టణంలోని విగ్నేశ్వర కాలనీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి పాత పద్ధతిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు ఆధ్వర్యంలో చేపట్టారు. లబ్ధిదారులకు రేషన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు, కోవూరు బక్క నాయుడు, భోగ చంద్రశేఖర్ , తాటి బోయిన కిష్టయ్య,సీనియర్ నాయకుడు తల్లిగా ప్రసాద్,యువ నాయకులు జయ, కృష్ణ, బషీర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే రేషన్ పంపిణి ప్రక్రియ జరుగుతుందని ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని, 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. పాత పద్ధతిలోనే ఈ రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Featured గూడూరు

కోట పంచాయతీలో రేషన్ సరకుల పంపిణీ ప్రారంభం

కోట పంచాయతీలో రేషన్ సరకుల పంపిణీ ప్రారంభం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమర్థవంతమైన పంపిణీకి చర్యలు – టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి కోట, పున్నమి న్యూస్ – కన్నారి సూరిబాబు కోట మండలంలోని కోట పంచాయతీ పరిధిలో రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కోట పంచాయతీలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట ఉన్న మెయిన్ రేషన్ దుకాణంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రేషన్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలి అని అన్నారు. రోజుకు 8 గంటల పాటు, 15 రోజులపాటు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం ప్రజలకు మేలు చేకూరుస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సకాలంలో సరుకులను అందించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్థాయి నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Featured తెలంగాణ

ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మంలో జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు ఖమ్మం ప్రతినిధి – పువ్వాడ నాగేంద్ర కుమార్ ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల జూన్ 3 నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సదస్సులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి రావాల్సిన ఫిర్యాదులను స్వీకరించి, పారదర్శకంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సదస్సుల ద్వారా భూ హక్కుల సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, రెవెన్యూ రికార్డుల సరిచూసే విషయాలు మొదలైనవి చర్చించనున్నాయి. ప్రజలు తమ సమస్యలపై సదస్సుల్లో నేరుగా హాజరై విన్నవించుకోవాలని, ప్రభుత్వం వారి పక్షాన ఉంది అని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ చర్యల ద్వారా ప్రజలకు న్యాయం చేయడం, ప్రజా విశ్వాసం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Featured తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో ఘనంగా ముగిసిన అయ్యప్ప ప్రీమియర్ లీగ్:

మహబూబ్‌నగర్‌లో ఘనంగా ముగిసిన అయ్యప్ప ప్రీమియర్ లీగ్ 📍 32 జట్ల పోటీతో నాలుగు రోజుల క్రీడా ఉత్సవం మహబూబ్‌నగర్ బాయ్స్ కాలేజీ గ్రౌండ్‌ వేదికగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప ప్రీమియర్ లీగ్ (APL) క్రికెట్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా శ్రీమతి డీకే అరుణ గారు (లోక్‌సభ సభ్యురాలు) హాజరై పోటీలు చూసి, క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “మహబూబ్‌నగర్ లో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం. ముఖ్యంగా గ్రామీణ యువతకు ప్రోత్సాహం ఇవ్వడం చాలా అవసరం. ఇలాంటి పోటీలు వాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు వేదిక అవుతాయి,” అని అన్నారు. కాసేపు ఆమె యువకులతో కలిసి క్రికెట్ ఆడి వారి ఉత్సాహాన్ని పెంచారు. “క్రీడలు మానసిక ధైర్యాన్ని, సహనాన్ని పెంపొందిస్తాయి. గెలుపు, ఓటమి సహజం – వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి” అని డీకే అరుణ గారు అన్నారు. అయ్యప్ప భక్తుల సంఘం చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ – “నా గెలుపులో భాగమైన అయ్యప్ప భక్తుల అసోసియేషన్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. మున్ముందు ఈ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగాలి,” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్వాహకుల ఘనత పోటీలను విజయవంతంగా నిర్వహించిన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితిని డీకే అరుణ గారు ప్రత్యేకంగా అభినందించారు. 32 జట్ల మధ్య సాగిన ఈ పోటీలు యువతలో క్రీడా స్పూర్తిని నింపినట్లు నిర్వాహకులు తెలిపారు.

Featured

సుబ్రహ్మణ్య స్వామి కుంభాభిషేక మహోత్సవము

*నంద్యాల జిల్లా(ఆంధ్ర).. పాణ్యం, కొత్తూరు సుబ్బారాయుడి క్షేత్రం… సుబ్రహ్మణ్య స్వామి కుంభాభిషేక మహోత్సవము మరియు ఆదివారం ఆశ్లేష నక్షత్ర షష్ఠి సందర్బంగా స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తకోట శివానంద స్వామి మరియు భక్త బృందం.

Featured తెలంగాణ

ఖమ్మం టూ టౌన్ పరిధి లో బీజేపీ ప్రబారిల నియామకం*.

*ఖమ్మం టూ టౌన్ పరిధి లో బీజేపీ ప్రబారిల నియామకం*. పున్నమి ప్రతినిధి:(నాగేంద్ర కుమార్) ఖమ్మం బీజేపీ టూ టౌన్ పరిధిలోని మొత్తం 15డివిజన్లకు ప్రబారిలను ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ఆదివారం నియమించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సూచనల మేరకు ప్రబారీలను నియమించినట్లు వెంకట నారాయణయాదవ్ తెలిపారు. ఒక ప్రభారీకి ఒక డివిజన్ చొప్పున 15 డివిజన్లకూ 15 మందిని ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త, పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి వంచన లేకుండా కృషి చేసే విధంగా ప్రబారీలు పనిచేయాలని వారి డివిజన్ లకు వచ్చే ప్రభారీ లను గౌరవప్రదంగా ఆహ్వానించాలి అని , ఖమ్మం టూ టౌన్ పరిధిలో బిజెపి అభ్యర్థిలు గెలుపే లక్ష్యంగా ప్రతి డివిజన్ లోప్రతి బూత్ కి ప్రతి ఇంటికీ గడపగడపకు బిజెపి ని విస్తరించే విధంగా పనిచేయాలని సూచించారు. నియమించిన కమిటీని ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రబారి, మందడపు సుబ్బారావు, జిల్లా ప్రభారీ కోకన్వీనర్, జ్వాలా నరసింహారావు గౌడ్ లకు నియమించిన పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమం లో పి శ్రీనివాస్ రెడ్డీ, వేల్పుల సుధాకర్, జిల్లెల్ల నాగరాజు, యుగంధర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Featured జాతీయ అంతర్జాతీయ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు.

    ఖమ్మం ప్రతి నిది(నాగేందర్ కుమార్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము సందర్భము గా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డిబిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భము గా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎర్పాటు లో ఆనాటి లోక్ సభ ప్రతి పక్ష నేతస్వర్గీయ శ్రీమతి సుష్మ స్వరాజ్ సభ లో బిల్ ప్రవేశ పెట్టి నాటి ఆదికార కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవడం వల్ల నే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కి నేటి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుంది అని వారు ఈ సం దర్భముగా అన్నారు.  

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.