Sunday, 12 July 2026

Blog

హైదరాబాద్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి: జూలై 26 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మరియు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ మరియు మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా మరియు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి: జూలై 26 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మరియు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ మరియు మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా మరియు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

దోమల నివారణకు ఫాగింగ్‌ ముమ్మరం

పలమనేరు , జులై 25( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు పట్టణంలో దోమల నియంత్రణకు ఫాగింగ్‌ ప్రక్రియను మున్సిపల్ సిబ్బంది ముమ్మరం చేశారు. రోజుకొక వార్డు లో ఫాగింగ్‌ యంత్రాలతో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫాగింగ్‌ చేస్తున్నారు. దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు. కుంటలు, చెరువులు ఇతర నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటి లార్వా ఆపరేషన్‌ చేపడుతున్నారు.

ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే. సురేంద్ర మోహన్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలకి ప్రత్యేక అధికారులని నియమించినది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే సురేంద్ర మోహన్ రంగా రెడ్డి:, డి. దివ్య హైదరాబాద్: ఇలాంబారి ఆదిలాబాద్: సి. హరికిరణ్ నల్గొండ: అనిత రామచంద్రన్ నిజామాబాద్: ఆర్. హనుమంతు కరీంనగర్: సర్పరాజ్ అహ్మద్ వరంగల్: కే. శశాంక్ మెదక్. ఏ శరత్ మహబూబ్ నగర్:రవి లని ప్రత్యేక అధికారులు గా తెలంగాణ ప్రభుత్వం నియమించినది.

యాదాద్రి భువనగిరి

ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబిసి డిపార్ట్మెంట్ “బాగాదారి న్యాయ సమ్మేళన్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గార్లతో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి జైబాబు జైభీమ్ జైసంవిధాన్ కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బాగాధారి సమ్మేళనకు విచ్చేసిన వారంతా మీ మీ ప్రాంతాలకు వెళ్లి మీ మీ గ్రామాలలో ఓబీసీలందరూ ఐక్యంగా ఓబీసీల జనాభా ఎంత ఓబిసిల వాటా అంత సాధించుకోలేనంతవరకు భారత దేశంలో ఉన్న బిజెపి పార్టీ పైన పోరాటం చేసి బీసీల కుల గణనను సాధించుకొని హక్కులను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ 50% మించి కూడా రిజర్వేషన్లు పొందడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బీసీల యొక్క వాటాను తేల్చుకొని హక్కులను సాధించుకునే అంతవరకు పోరాటం చేయాలని రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటాలు అందించి రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా ప్రజా సామ్యుద్ధంగా అందిస్తామని తెలియజేశారు ఈకార్యక్రమంలో పడిగెల ప్రదీప్ ఆంజనేయులు గౌడ్ భిక్షం రామలింగం యాదవ్ శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొనడం జరిగింది*

హైదరాబాద్

సి పి ఐ (ఎం) కి బాంబే హైకోర్టు షాక్

పున్నమి ప్రతినిధి ముంబైలో.. గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు… మీ సొంతదేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. మన దేశంలో సమస్యలు ఉన్నాయి కదా. న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్ లు అన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు

*లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* రామగుండం, జులై 25, పున్నమి ప్రతినిధి: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ, పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

*విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి* మహదేవపూర్, జులై 25, పున్నమి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కళాశాల ప్రిన్సిపల్ ఎన్. నర్సయ్య శుక్రవారం భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి దినం కాలేశ్వరం నుండి వచ్చే విద్యార్థులకు కళాశాలకు సమీపములో గల బోమ్మాపూర్ ఎక్స్ రోడ్ వద్ద బస్సులు ఆపాలని వారు కోరారు. దీంతోపాటు మహదేవ్ పూర్ మండలంలోని సర్వాయి పేట, పంకేన, అంబటిపల్లి, సూరారం, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం శనివారం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన డిపో మేనేజర్ ఇందు కు కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, రమేష్,పాల్గొన్నారు.

ఖమ్మం

ప్రధాని గా నేటి కి 4078 రోజుల పదవి కాలం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ

పున్నమి ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు..!! నేటితో (జూలై 25, 2025) ఆయన 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు..!! ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును అధిగమించారు..!! ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డుకెక్కారు ఇదిలా ఉండగా.. మోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని ప్రారంభించారు..!! రాష్ట్రం, కేంద్రం రెండింటిలోనూ దాదాపు 24 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించారు..!! ఈ ఘనత ఇప్పటివరకు మరే ఇతర భారత ప్రధానమంత్రి పేరు మీద లేదు. మోడీ రాజకీయ ట్రాక్ రికార్డ్‌లో వరుసగా మూడు జాతీయ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించారు..!! ఈ ఘనత గతంలో జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు..!! ఇంతే కాదు ఇంకా చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. అవేంటో చూద్దాం. 1)స్వతంత్ర భారతదేశంలో జన్మించిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోడీ..!! 2)అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధాని.. 3)రెండు టర్ములు పూర్తి చేసి, మూడవసారి ఎన్నికైన మొదటి కాంగ్రెసేతర నాయకుడు..!! 4)లోక్‌సభలో స్వయంగా మెజారిటీ సాధించిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి..!! 5)ఇందిరా గాంధీ తర్వాత వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ సాధించిన మొదటి ప్రధానమంత్రి.. 6)2002, 2007, 2012 (గుజరాత్), 2014, 2019, 2024 (లోక్‌సభ) – వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకున్న ప్రధాని

ఖమ్మం

అత్యవసరము అయితే 100 కి సమాచారం ఇవ్వండి :సీపీ

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పలు సూచన లు చేసారు. ఆత్యవసరం అయితే 100, 1077, 871265911130, 906321129 నెంబర్ లకి సమాచారం ఇవ్వాలని అని కమిషనర్ తెలిపారు. పొంగుతున్న వాగులు, వంకలు ని దాటద్దు అని కమిషనర్ సునీల్ దత్ ప్రజలకి విజ్ఞప్తి చేశారూ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.