Saturday, 23 May 2026

Blog

Featured

నెల్లూరు జిల్లాలో మహిళ రోడ్డు ప్రమాదం…

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నాయుడు పేట వైపు నుండి గూడూరుకి వెళ్తున్న బైకును లారీ వెనక నుండి ఢీకొనడంతో బైక్ వెనక కూర్చొన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ తోలుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు అతనిని 108 వాహనంలో గూడూరు ఏరియా హోస్పీటల్ కి తరలించారు.

Featured

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి

మనుబోలు 22-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ తో మనుబోలు మండలం లోని400 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు చితికి పోయినవి ఉపాధి లేక పస్తులు తో అల్లాడుతున్నారు వారిని ఆదుకోవాలని మనుబోలు మండలం విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు కోరినారు ఇ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కి ఎంపిడిఓ కి వినతిపత్రం ని సమర్పించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు,అధ్యక్షుడు రాము ఆచారీ ప్రభాకర్ రవి చైత్యన్య అమరేంద్ర ఆచారీ తదితరులు పాల్గొన్నారు.

Featured

నెల్లూరు నగరంలో రేపటి నుంచి దుకాణాలకు అనుమతి

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️ లాక్ డౌన్ నేపధ్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా మూతపడిన వ్యాపార వాణిజ్య రంగాలకు ఉపశమనం కల్పిస్తూ శుక్రవారం నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేలా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ టి.బాపిరెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉదయం 7గం నుండి సాయంత్రం 7 గంటల వరకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.

Featured

రాపూరు లో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు….

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లో కరోనా లాక్ డౌన్ కారణంగా 58 రోజులు నుండి బోసిపోయిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు ప్రభుత్వం అదేశాలమేరకు బస్సులు వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో డిఎం రామకృష్ణ మాట్లాడుతూ రాపూరు డిపో నుండి 16 బస్సులు నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, రాజంపేట, కడప కు వదలడం జరిగింది డ్యూటీ చేస్తున్న డ్రైవర్లు ఇతర సిబ్బందికి పరీక్షలు చేసిన తర్వాతే విధులోకి అనుమతి మరియు ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబరు తీసుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకుని ప్రయాణం చేయాలి అని డిపో మేనేజర్ డి ఎం రామకృష్ణ తెలియజేశారు.

Featured

షేక్ రియాజ్ భాషా రంజాన్ తోఫా మరియు నగదు పంపిణీ

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లో నెల్లూరు కు చెందిన హైదరాబాద్ లైటింగ్ నిర్వహకుడు షేక్ రియాజ్ భాషా తన తండ్రి గారైన లేట్ షేక్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తెలుగుదేశం రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్ ముక్తార్ సమక్షంలో రాపూరు పట్టణంలోని సుమారు రెండు వందల మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా మరియు నగదు రూపాన జకాత్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Featured

రాపూరు మండలంలోని ముస్లింలకు బండి వేణుగోపాల్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు కరోనా రక్కసి వల్ల బ్రతుకు జీవనం సాగించేందుకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రంజాన్ పండుగ పురస్కరించుకుని మండలంలోని ప్రతి ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో మండలంలోని ముస్లిం కుటుంబలన్నింటికి 5 వస్తవులతో కూడిన కిట్లను మండలంలోని మసీదులోని మౌజన్లు,ఇమామ్ లకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మండలంలోని పెనుబర్తి నుంచి మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని పెనుబర్త గ్రామం నుంచి ప్రారంభిచిన బండి వేణుగోపాల్ రెడ్డి పెనుబర్తి , గోనుపల్లి, ఓబులంపల్లి,లో ఉన్న ముస్లింలకు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు,రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం ముస్లింలకు ఈరోజు రంజాన్ తోఫా అందజేస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 51 వ రోజు అన్నదానం

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు తూర్పు అగర్తకట్ట వద్ద కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి మాజీ MPP రాపూరు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డిగారి సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది వారికి మరియుగత 50 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 50 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేశారు

Featured

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరపుపాడు గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి పోకుండా తిరిగి ముందుకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది. నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ఉప ఆరోగ్య కేంద్రాలతో గ్రామస్థులకు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడకుండా సిమెంటు రోడ్లు, డ్రైన్లు మొదలగు నిర్మాణాలను చేపడుతున్నాం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్ని ఇంటి ముంగిటకే చేర్చే ప్రక్రియను తీసుకొని వచ్చాము.వాలంటీర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించి, వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు చేసిన వారి నోళ్లకు తాళం వేశారు.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గత 5 సంవత్సరాలలో చేయలేకపోయిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారంలోని 5 సంవత్సరాలతో కలిపి 10 సంవత్సరాల అభివృద్ధిని అందిస్తా.2 సార్లు శాసన సభ్యునిగా అవకాశం ఇచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Featured ఆంధ్రప్రదేశ్

రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పటికీ, రేపటి(21 మే 2020) నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి మే 24వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వచ్చే 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డి) స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా రెంట చింతలలో మూడు రోజులుగా తన ప్రభావం చూపిస్తున్నాడు సూర్యుడు.. ఈ ప్రాంతంలో ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా చెప్పారు. రాబోయే రెండు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. తుని, బాపట్ల, కావలి, కాకినాడ, మాచిలిపట్నం, నర్సాపూర్ మరియు జంగమహేశ్వరపురం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5- 6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అదేవిధంగా, నెల్లూరు, కడప, అనంతపురం, ఒంగోల్, విజయవాడ, కర్నూలు మరియు తిరుపతిలలో మిడిల్ హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తాయి.

Featured

కంటైన్మెంట్ జోన్స్ మినహా తీసేందుకు అనుమతి

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరు జిల్లా కేంద్రంతో ఇతర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ దుకాణాలు తీసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి జారీ చేస్తునట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మాత్రం 6 నుంచి 9 వరకు మాత్రమే అనుమతి జారీ చేస్తున్నామన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.