Sunday, 24 May 2026

Blog

Featured

సహాయం

నెల్లూరు,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ సేవలందిస్తున్న అత్యవసర సర్వీస్లు వారికి 54 రోజుల పాటు అత్యవసర శాఖ అధికారులకు ఉద్యోగులకు సొంటి కషాయం అందజేసిన సుగర్ కేన్ డిపార్ట్మెంట్ చిరుద్యోగి వి, శ్రీనివాసులు గారిని, నెల్లూరు వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బి గౌతమ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు వారి తోటి కార్యవర్గ సభ్యులు అధికారులు ఉద్యోగులు ఘనంగా అభినందించారు. సాయి ఉద్యోగం చిన్నదని హృదయం సేవాగుసహాయకులుగా వ్యవహరించిన కార్పొరేషన్ణం పెద్దదని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సిటీ అధ్యక్షుడు పులి సతీష్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, DPHNO లు జి మంజుల, జి. బూలోకమ్మ, HEO  శర్మ , కాంతయ్య గారు, నాయకులు శ్రీధర్ పెద్దయ్య రమేష్ చంద్ర ఘతదితరులు పాల్గొన్నారు.

Featured

కోడికూర ఎంత పని చేసిందో!

కోడికూర ఎంత పని చేసిందో!!!! ఓ వ్యక్తి ఆశా కార్యకర్తపై దాడి. యశవంతపుర : పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌ లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. మహారాష్ట్ర నుంచి కలబురిగి జిల్లాకు వచ్చిన వారికి అళంద కిణ్ణి అబ్బాస్‌ గ్రామంలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేప కూరతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. ఇందుకు సమాధానంగా ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు. దీంతో కోపానికి గురైన ఆ వ్యక్తి రేణుకపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

Featured

మళ్లీ వస్తాం..

మళ్లీ వస్తాం.. —————————- మేం నడిసెల్లి పోతున్నాం దుఖంతో,కోపంతో,ద్వేషంతో మేం మా పల్లె కెళ్ళి పోతున్నాం ఐదారేళ్ళ మా పిల్లలు, అరవై ఏళ్ల మా పెద్దలు, కడుపుతో ఉన్న మా ఆడాళ్ళు, చింకి పాతర్ల మా సామాను అన్నీ సర్దుకుని సాగెల్లి పోతున్నాం.. కనికరం లేని మీ ముఖాన ఖాండ్రించి ఉమ్మేసి కన్నీళ్ళ తోనో, కాళ్ళ నొప్పుల తోనో, మేం కదిలెల్లి పోతున్నాం.. నగరాలన్నీ నాగరిక మని, గ్రామాలన్నీ అనాగరికం అని, మీరు విర్రవీగుతారు కానీ, నిజం చెప్పండి.. ఏముందిక్కడ.. విద్వేషంతో కడుపులో కుమ్మే మీ కత్తులు,త్రిశూలాల కంటే భూమిని చీల్చి అన్నం తీసే మా నాగలి గొప్ప.. ఆడాళ్ళను బజారు సరుకు చేసి గుడ్డలిప్పిన మీ నగరాల కంటే పత్తి పండించే మా రైతులు గొప్ప బట్టనేసిన మా పల్లె మగ్గాలు గొప్ప బడికి పంపినా మా పిల్లలకు పాఠాలు చెప్పని మీ పంతుళ్ళ కంటే బతుకు పాఠాలు నేర్పిన మా అయ్యవ్వలు గొప్ప పేదలను పట్టించుకోని మీ ప్రగతి భవనాల కంటే కురుస్తున్నా,కూలుతున్నా కడుపులో పెట్టుకునే మా గుడిసె గొప్ప మా పల్లె తల్లి గొప్ప అంతెందుకు, మనుషుల్ని చంపే మీ మద్యం షాపుల కంటే చల్లని నీరా ఇచ్చే మా తాటి చెట్టు గొప్ప కరెన్సీ బాబుల కండకావరం మేం చూశాం కానీ, మీ మధ్య తరగతి మందహాసం కూడా మాకు అసహ్యమే.. మా భుజాల మీదెక్కి పైకి ఎగ బాకాలనే యావ తప్ప మీరు క్రిందికి చూసిందెప్పుడు.. మమ్మల్ని పట్టించుకున్నదెప్పుడు.. వెలుగులు చిమ్మే మీ భవంతుల గోడ పక్క చీకట్లో మా వాడలుంటాయనీ, మేమక్కడ కిక్కిరిసి ఉంటామనీ, స్పృహ లేని పరాన్న జీవులు మీరు మీ అంట్లు తోమే ఆడ మనిషీ, మీ బంగ్లా కాపలా మనిషీ, మీ కారు తోలే డ్రైవరు,. మీ కార్ఖానలో కార్మికుడు, అంతటా, అన్నిటా మేమే కదా.. మమ్మల్ని మీ సేవలు చేసే యంత్రాలుగా తప్ప, మనుషులుగా చూడరని మీ బంగ్లా కింద మా కోసం కట్టే రూమే చెబుతుంది. మీ లెక్కల మతలబు మాకు అర్థం కాదు కానీ, నిగ్గదీసి అడిగితే నిలువు గుడ్లేయడం తప్ప నిలబడి జవాబు చెప్పే నిజాయితీ ఉందా మీకు.. మేము చెయ్యని దేమిటి.. మీరు చేసిన దేమిటి.. రోడ్ల వెంట మేము నాటిన మొక్కలు యెన్ని.. రోడ్ల కోసం మీరు కూల్చిన చెట్లు యెన్ని.. మీ బాగు కోసం మేము కార్చిన చెమట యెంత.. అభివృద్ధి పేరిట మీరు పోసిన విషం యెంత.. మీకోసం మేము కట్టిన భవంతులెన్ని.. మీ ఆనందం కోసం మీరు కూల్చిన గుడిసెలు యెన్ని.. కరెన్సీ నోట్ల వాసన మీకు ఇంపు కార్మికుల చమట వాసన మీకు కంపు తిండి పెట్టకుండా తరిమేస్తున్న నీతి మీది “తినిపో బిడ్డా” అని పిలిచే రీతి మాది మళ్లీ వస్తాం మేం.. పట్నం లోనే ఆగిపోయిన మా పల్లె బిడ్డల కోసం, పగలూ రాత్రీ మాకోసం పరుగు లెత్తిన మంచి మనుషులు కోసం, ఈ సారి కన్నీళ్ళతో రాం.. ప్రశ్నల కొడవళ్ళతో వస్తాం.. కడుపు చేత పట్టుకుని రాం.. కదన శంఖం పూరిస్తూ వస్తాం.. పోగేసిన సంపదలో మా వాటా యెంత.. హక్కుల పత్రంలో మా జాగా యెంత.. – కన్నెగంటి రవి

అనంతపురం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల మాజీ సర్పంచ్ అయినటువంటితన తల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది తాను ఎంత ఎత్తు ఎదిగిన తాను పుట్టిన గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునికరోనా నేపథ్యంలో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని పంపిణీ చేసేందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Featured

లాక్ డౌన్ లో ఆకలికి అలమటిస్తూ వున్న వారి పొట్ట నింపుతున్న మనసున్న మహానుభావులు

24.04.2020, నెల్లూరు,(పున్నమి ప్రతినిధి – సి.యస్.రావు ) *లాక్ డౌన్ లో ఆకలికి అలమటిస్తూ వున్న వారి పొట్ట నింపుతున్న మనసున్న మహానుభావులు* పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా తిండి తిప్పలకు అల్లాడుతున్న బిచ్చగాళ్లను, వలస కూలీలును , నేషనల్ హైవే పై పలు రాష్ట్రాలకు జిల్లాలకు వెళ్తున్న కూలీలు ఇతరులకు 40 రోజులుగా వంద మందికి టిఫిన్ , భోజనం మంచినీరు అందజేస్తూ ,వారి ఆర్థిక స్థితి గురించి కూడా పట్టించుకోకుండా, మానవత్వంతో ఆలోచించి సేవ చేస్తూ సేవ చేసిన విషయం కూడా ఫోటోలు వీడియోలు తీయకుండా మాధ్యమాల్లో ప్రచారం చేసుకోకుండా సేవ చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ రావు గుర్తించి , ఆ రెండు కుటుంబాల వారు ఆటోలో ఫుడ్ తీసుకువచ్చి అన్నం పెడుతూ ఆకలి తీర్చుతున్న , తోటి వ్యక్తుల ఆకలి బాధను అర్థం చేసుకుంటూ సేవ చేస్తున్న వేణు గోపాల్ వర్మ -శేష శైలజ, సునీల్ – లక్ష్మీ గార్లను ఘనంగా అభినందించారు. ఈ రోజు కూడా నేషనల్ హైవే లో వెళ్లే వలస కూలీలకు ,అయ్యప్ప గుడి దగ్గర ,ఆత్మకూరు బస్టాండ్ పరిధిలోని సాయి బాబా గుడి దగ్గర ఉన్నవారికి ఉదయం 9 గంటలకు టిఫిన్ అంద చేయడం జరిగింది. కరోనా కోవిద్ 19 కారణంగా పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్న వారి ఆకలి తీరుస్తూ ప్రచార ఆర్భాటాలు దూరంగా ఉంటూ సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించే దానిలో భాగంగా వీరిని అభినందించడం జరిగిందని ఆయన అన్నారు.

Featured

ఆందోళన చెందకండి అండగా నేనున్నా..కాకాణి భరోసా

24-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం నందు తన సొంతనిధులతోకూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయనకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ కరోన మహమ్మారి వచ్చనప్పటినుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూసహాయసహకారాలుఅందిస్తున్నారు మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి ఈ రోజు మనుబోలులో సొంత నిదులతో వారము నకు సరిపడా కూరగాయలు,గుడ్లు పంపిణీ చేసినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనుబోలు లో కరోనా పాజిటివ్ కేసు వచ్చినప్పటినుంచివాళ్లకు కావలసిన కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇంటిదగ్గర కే అందజేస్తున్నాము కంటోన్మెంట్ జోన్ లో ఉంది కావున ప్రజలు రాకపోకలు చేసే వీలు లేదు కనుక వాళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులు మందులు మొదలైన వాటికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఒక అధికారిని ఏర్పాటు చేశాము జాతీయ రహదారి పక్కన ఉండే గ్రామాల కనుక కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకున్నాము అని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దాసరి భాస్కర్ గౌడ్ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోటేశ్వర్ గౌడ్ , దాసరి మహీంద్ర వర్మ చల్ల రవీంద్ర ,నవకోటి,దయాకర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Featured

గుంజి రమేష్ ఆధ్వర్యంలో గోవిందరాజపురం గ్రామం లో చారిత్రాత్మక విజయం సంవత్సరం ఐన సందర్భంగా వేడుక

23-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంవత్సర కాలం పూర్తైన సందర్బంగా ఆనందోత్సాహలలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసిన నాయకులు ఏడాది క్రితం ఈ రోజు రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు రెండవ సారి శాసన సభ్యునిగా సర్వేపల్లి నియోజక వర్గం నుండి గెలిచిన కాకాణి గోవర్దన్ రెడ్డి గారు. నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరును తెచ్చిన ప్రజా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజసేవలో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు వచ్చే సంవత్సరానికి కాకాణి గారు మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకాణి గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలని కోరుకుంటున్నాము,అలాగే మన గౌరవననీయులుశ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సి ఎం గా మన అందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకోండూరు పంచాయతీ గోవిందరాజుపురంగ్రామంలో సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుంజి రమేష్ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో గుత్తికొండ బ్రహ్మయ్య, బిట్ర హరి ,మాడా రామక్రృిష్ణ బ్రహ్మయ్య సుమంత్ పాల్గొన్నారు.

Featured

చారిత్రక విజయానికి ఏడాది

మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) సర్వేపల్లి నియోజకవర్గం యం.ఎల్.ఏ ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులు అవ్వి ఈ రోజుకు ఒక సంవత్సరం ఐనది వచ్చే సంవత్సరం నకు కాకాని గారు మంత్రి గా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ కాకాని గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలనికోరుకుంటున్నాము.అలాగే మన గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు CM గా అవ్వి మనఅందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకొండూరు పంచాయితీ లో జ్యోతి నగర్ కాలనిలో ఆవుల తులసిరామ్ యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి చేతులు మీదగా కేక్ కట్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో జ్యోతి నగర్ గ్రామ ప్రజలు మాస్కులు తో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు.

Featured

మిత్రుల ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహారం పంపిణీ

మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతూ సుదూర ప్రాంతాలకు కాలి నడకన వేలుతున్న వలస కూలీలకు మేమున్నామని మనుబోలు గ్రామానికి చెందిన మిత్రులు నీలిశెట్టి రవిచంద్ర,నీలిశెట్టి వెంకట కృష్ణ, మద్దాలి సాయి వినోద్ కుమార్,షేక్ జాకీర్ కలసి రోడ్డు వెంబడి వెళ్తున్న వలస కార్మికులకు మరియు లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,వైద్య సిబ్బంది ఎంపీడీఓ,తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందికి భోజనాలు మరియు పెరుగన్నం పంపిణీ చేసారు. మిత్రులు మాట్లాడుతూ యిలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయంగా అందచేస్తున్నాము అని తెలిపేరు.

Featured

కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి అనిల్ సమీక్ష సమావేశం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు కరోనా నివారణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రెండోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.